E-Paper
Advertisement

ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. లైంగిక దాడి ఆరోపణల కేసులో!

ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. లైంగిక దాడి ఆరోపణల కేసులో!
Advertisement

Film industry:సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి, నటులపై అఘాయిత్యాలకు పాల్పడే ఉదంతాలు తరచూ సినీ రంగాన్ని కుదిపేస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అలాంటి మరో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చి తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 33 ఏళ్ల నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 73 ఏళ్ల సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీ (Shakeel Noorani)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయనపై లైంగిక దాడి, బెదిరింపులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి.

అవకాశాల పేరుతో పరిచయం :

‘బడే దిల్ వాలా’, ‘జోరు కా గులామ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన షకీల్ నూరానీకి 2016లో ఓ అవార్డుల వేడుకలో బాధితురాలైన నటితో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సినిమా అవకాశాలు ఇస్తానని, తనను కలవవచ్చని ఆయన ఆ నటికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినిమా రంగంలో స్థిరపడాలనే ఆశతో ఉన్న ఆ నటి ఆయన మాటలను నమ్మి సంప్రదించింది.

కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి దారుణం..

Advertisement

స్క్రిప్ట్ చర్చ పేరుతో ఇంటికి పిలిచి నటిపై అఘాయిత్యం చేశారు. అక్కడ ఆమెకు కూల్ డ్రింక్‌లో బలవంతంగా మత్తు మాత్రలు కలిపి ఇచ్చి, ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అంతేకాకుండా ఆ ఘటనను రహస్యంగా వీడియో రికార్డ్ చేసి, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ALSO READ:బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఇంట్లో భారీ దొంగతనం!

ఫామ్‌హౌస్‌లో దొరికిన డైరెక్టర్..

Advertisement

బాధితురాలి ఫిర్యాదు అందుకున్న వెంటనే మాల్వానీ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నూరానీ మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఇక ఆగస్టు 8న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించారు.

తీవ్ర దిగ్భ్రాంతిలో ఫిల్మ్ ఇండస్ట్రీ..

ప్రముఖ సీనియర్ దర్శకుడిపై ఈ తరహా తీవ్రమైన కేసులు నమోదు కావడం, ఆయన అరెస్టు కావడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్, మహిళలపై జరుగుతున్న వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అవకాశాల పేరుతో సినీ రంగానికి వచ్చే యువ నటీనటులను లొంగదీసుకోవడం, వారి జీవితాలతో ఆడుకోవడం క్షమించరాని నేరం. బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తారని సినీ ప్రియులు ఆశిస్తున్నారు.

Related News

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×