Mehreen Pirzada: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల రిలేషన్స్ గురించి పెళ్లిళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు నిత్యం చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నటి మెహ్రీన్(Mehreen) పెళ్లికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మెహ్రీన్ ఇదివరకే నిశ్చితార్థం జరుపుకొని అనంతరం తన నిశ్చితార్థాన్ని బ్రేకప్ చెప్పుకున్నారు.
ఇలా చివరి నిమిషంలో ఈమె పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో, తరచూ తన పెళ్లికి సంబంధించి ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై మెహ్రీన్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.” నేను ఇప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు , భవిష్యత్తులో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కచ్చితంగా ఈ విషయాన్ని నేనే అందరికీ అధికారికంగా తెలియజేస్తాను. దయచేసి తప్పుడు సమాచారాన్ని మాత్రం ప్రచారం చేయొద్దని, ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వారిని ఇకపై జర్నలిస్టుగా పిలవకూడదు అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.
తన జీవితం గురించి ఏదైనా సమాచారం ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలిగే ఏకైక వ్యక్తిని తానే అంటూ ఈమె తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లను ఖండిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇకపై తన జీవితం గురించి ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈమె ఈ సందర్భంగా కోరారు. ఇలా మెహ్రీన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈమె పూర్తిగా చెక్ పెట్టారని చెప్పాలి.
భవ్య భిష్నోయ్ తో నిశ్చితార్థం..
ఇక ఈమె ఇదివరకు భవ్య భిష్నోయ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో పెళ్లి జరగబోతోందన్న నేపథ్యంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇలా బ్రేకప్ అయిన అనంతరం మెహరీన్ పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక ఈమె తెలుగులో రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.. ఇక ఈమె ఇటీవల స్పార్క్ అనే సినిమాలో కూడా నటించారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు . మెహరీన్ నటించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే వెబ్ సిరీస్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు కన్నడ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Varanasi Film: వారణాసి షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..స్పీడుమీదున్న జక్కన్న!