E-Paper
Advertisement

తండ్రి మరణంపై పూర్ణ ఎమోషనల్ పోస్ట్!

తండ్రి మరణంపై పూర్ణ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Actress Poorna: ప్రముఖ సినీనటి పూర్ణ(Poorna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఒకప్పుడు హీరోయిన్గా కూడా చేసిన విషయం తెలిసిందే. కానీ కాలం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాదు డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా.. ఇద్దరు పిల్లలతో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

అల్లా సన్నిధికి చేరి 9 ఏళ్లవుతోంది – పూర్ణ

ఇదివరకే ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె.. ఇటీవల పండంటి పాపకి కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పిల్లలు, భర్త, కుటుంబం అంటూ ఇంటికే పరిమితమైన పూర్ణ.. తాజాగా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తండ్రి చనిపోయి తొమ్మిది ఏళ్ళు అయిన సందర్భంగా మరొకసారి ఆయనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ” ప్రియమైన నాన్న.. ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి మీరు తొమ్మిదేళ్లు అవుతోంది.

Advertisement

also read:వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

మీ ప్రతిరూపాన్ని నా రెండో బిడ్డ కళ్ళల్లో చూసుకుంటున్నా – పూర్ణ

అయినా మీ జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసే అవకాశం లేకపోయినా.. మీ ప్రేమ, దయ, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారి మిమ్మల్ని మళ్లీ ఒకసారి కలిసి ఉంటే ఎంతో బాగుండేది అనిపిస్తోంది. మీరు లేకపోయినా నా రెండో బిడ్డ కళ్లల్లో మీ ప్రతిబింబాన్ని చూస్తున్నాను. అల్లా మీ జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా మన కుటుంబానికి ఈ బిడ్డను ప్రసాదించాడు అనిపిస్తోంది. మీ ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లు అనిపిస్తోంది. మీరు చనిపోయి తొమ్మిదేళ్లు అవుతున్నా.. అమ్మకు మాత్రం అది నిన్న జరిగినట్లు అనిపిస్తోంది. కాలం గడిచినా..మీరు లేని లోటు మీపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ మిమ్మల్ని మరువలేం” అంటూ ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. ప్రస్తుతం పూర్ణ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పోయినవారు తిరిగిరారు.. వారి జ్ఞాపకాలలో బ్రతికేయాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పూర్ణ కెరియర్..

Advertisement

పూర్ణ కెరియర్ విషయానికొస్తే.. వివాహం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈమె కొంతకాలం బ్రేక్ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి అనే స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అఖండ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక పూర్ణ విషయానికి వస్తే కేరళకు చెందిన ఈమె దుబాయ్ లో ఉండే షరీఫ్ అసిఫ్ అలీ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం . ప్రస్తుతం పెళ్లి ఫ్యామిలీ అంటూ బిజీగా గడిపేస్తున్నారు ఈమె మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఎప్పుడు మొదలు పెడుతుందో చూడాలి. ఇక ఈసారి మరో అద్భుతమైన కథతో ప్రేక్షకులను పలకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్.. వెనకడుగు వేసిన సంగీత!

చిన్న డైలాగ్.. పెద్ద దుమారం.. ఇదే సోషల్ మీడియా మ్యాజిక్!

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

51 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే ఉంటా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ‘దందా’ దొర సాయి తేజ సినీ జర్నీ!

‘పళ్ళ బురుసు’ కోసం కోర్టుకెక్కిన పంచాయతీ.. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ఐకాన్ స్టార్ షాకింగ్ నిర్ణయం..?

Big Stories

Advertisement
×