E-Paper
Advertisement

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!
Advertisement

Chiranjeevi: గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న వరుణ్ తేజ్(Varun Tej).. అటు వ్యక్తిగతంగా పెళ్లి చేసుకుని తండ్రిగా ప్రమోట్ అయిన విషయం తెలిసిందే.కొడుకు పుట్టిన తర్వాత ఆయన కెరియర్ లో ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. దీంతో ఎట్టకేలకు జానర్ మార్చి ఇండో కొరియన్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో కొరియన్ కనకరాజు(Korean kanakaraju)అంటూ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వైవిద్యమైన ,వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో రితికా నాయక్ (Rithika Naik)హీరోయిన్గా నటించగా.. ప్రముఖ నటుడు సత్య (Sathya)కీలక పాత్ర పోషించారు.

కొరియన్ కనకరాజు పై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్..

ప్రీమియర్ తో మొదలైన ఈ సినిమా మొదటి షో తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 125 షోలు వేయగా.. ఏకంగా 100 థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడడం గమనార్హం. ముఖ్యంగా ఇండో కొరియన్ కాన్సెప్ట్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దూసుకుపోతోంది.మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొరియన్ కనకరాజు చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

also read:బండి ఆపితే రామ్ చరణ్ ఫోటో చూపిస్తా – రోజా

వరుణ్ తేజ్ కష్టానికి తగిన నిజమైన ప్రతిఫలం – చిరంజీవి

ఈ సందర్భంగా హీరోగా వరుణ్ తేజ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన విడుదల చేసిన ప్రకటన ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన అధికారిక పోస్ట్ ద్వారా..” కొరియన్ కనకరాజు సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా థియేటర్లలో నవ్వులే నవ్వులు అనే మాట వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ఈ విజయాన్ని అందుకోవడానికి అన్ని విధాలా అర్హుడవు.. ఈ సినిమా విజయం కోసం నువ్వు పడిన కష్టానికి, నటన పట్ల నీకు వున్న నిబద్ధతకు తగిన ప్రతిఫలం ఎట్టకేలకు లభించింది. ఈ గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్న చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు. త్వరలో నేను కూడా ఈ సినిమా చూస్తాను. ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో మరింత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వరుణ్ తేజ్ సినిమాకి పెదనాన్న అందించిన అదనపు ప్రమోషన్ అనే కామెంట్లు సోషల్ మీడియా వేదికను వ్యక్తమవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం ఈ వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli)దర్శకత్వంలో బెంగాల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చి మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు మళ్లీ బాబీ డైరెక్షన్లో మూవీ ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Related News

ది ప్యారడైజ్ దెబ్బ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఇప్పుడైనా మార్పు వస్తుందా?

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

Big Stories

Advertisement
×