E-Paper
Advertisement

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!
Advertisement

Bandla Ganesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ గా, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు బండ్ల గణేష్ (Bandla Ganesh). నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలిచే ఈయన.. తాజాగా తన ఇంట పెళ్లి వేడుకలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. బండ్ల గణేష్ కూతురు జనని (Janani ) వివాహం ఆగస్టు 16 ఉదయం 11:58 గంటలకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనుంది.

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి వేడుక..

ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను, స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి తమ కూతురు పెళ్లికి రావాలి అని బండ్ల గణేష్ ఆహ్వానిస్తున్నారు. పెళ్లి ముహూర్తానికి దగ్గర పడుతున్న నేపథ్యంలో బండ్ల గణేష్ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం బండ్ల గణేష్ ఇంట్లో సంగీత్ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. జనని సంగీత్ వేడుకలలో జనని సోదరుడు బండ్ల హితేష్ (Bandla Hitesh) చేసిన డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారుతోంది.

ఘనంగా హల్దీ ఫంక్షన్..

Advertisement

అయితే ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ హల్దీ వేడుక చాలా ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు , బంధుమిత్రుల మధ్య జనని హల్దీ వేడుకలు ముగిసాయి. ముఖ్యంగా బండ్ల గణేష్ తన కూతురికి పసుపు రాసి వేడుకను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వేడుక చాలా ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే బండ్ల గణేష్ ఇంట్లో ఒక్కో వేడుక అందరిని ఆకట్టుకుంటోందని చెప్పాలి.

బండ్ల గణేష్ కాబోయే అల్లుడు ఎవరు?

బండ్ల గణేష్ కి కాబోయే అల్లుడు విషయానికి వస్తే.. జనని వివాహం చేసుకోబోతున్న అబ్బాయి పేరు సూర్య తేజ చిలుకూరి. అయితే బండ్ల గణేష్ తన కాబోయే అల్లుడి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు. మరి ఆయన ఏం చేస్తారు? వారి బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గోప్యంగా ఉండడం గమనార్హం.

బండ్ల గణేష్ కుమారుడు ఎంట్రీ?

Advertisement

ఇకపోతే బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన సంగీత్ కార్యక్రమాలలో బండ్ల గణేష్ కొడుకు బండ్ల హితేష్ డాన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హితేష్ ఇండస్ట్రీ అరంగేట్రం చేయనున్నారా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బండ్ల గణేష్ తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని.. పైగా పెద్ది లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సన(Buchhibabu sana) దర్శకత్వం వహించనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ బండ్ల హితేష్ మాత్రం తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కటౌట్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఒకవేళ ఆయన ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Related News

నిర్మాత కారు యాక్సిడెంట్.. హాస్పిటల్ ఖర్చుల దగ్గరే అసలు గొడవ!వైరల్ వీడియో

సుకుమార్ కూతురి ఖాతాలో మరో ఘనత!

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరిదో? తెరపైకి ముగ్గురు డైరెక్టర్లు!

కిమ్స్ హాస్పిటల్ నుండి ఎన్టీఆర్ డిశ్చార్జ్.. సర్జరీ తర్వాత తొలి ఫోటో!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఆగని ‘ డ్రాగన్’ మూవీ షూటింగ్!

కలిసొచ్చిన లక్కీ భాస్కర్.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీకి భారీ బిజినెస్!

రీల్స్ చూసి ఆసుపత్రిపాలైన షకీలా!

Big Stories

Advertisement
×