Ritu Varma:అందాల తార, తెలుగు అందం రీతు వర్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. విజయ్ దేవరకొండ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది.

సరైన అవకాశం లభించాలే కానీ తన నటనతో అదరగొట్టేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటు ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా సందడి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ చీర కట్టుకొని తన గ్లామర్ లుక్కుతో ఆడియన్స్ హృదయాలను దోచుకునే ప్రయత్నం చేసింది.

ప్లెయిన్ ఎల్లో కలర్ చీరకు హెవీ ఎంబ్రాయిడరీ తో బోర్డర్ డిజైన్ చేయగా.. దీనికి కాంబినేషన్లో హెవీ డిజైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాలతో తన మేకప్ లుక్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇక నడుము కనిపించేలా చీర కట్టిన ఈమె ఆ నడుము వయ్యారాలతో కుర్ర కారు గుండెల్లో గుణపాలు దించింది.. రీతు వర్మ లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

రీతు వర్మ సినిమాలే కాదు అటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీతు వర్మ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రముఖ హీరో గోపీచంద్ తో కలిసి భరతవర్ష అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఒక విభిన్నమైన పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిత్రంతోపాటు తమిళ్ స్పై సినిమా ధ్రువ నక్షత్రంలో కూడా నటిస్తోంది. వీటితోపాటు మరికొన్ని చిత్రాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటున్నాయి. ఇటు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కు చేరువలో ఉంటుంది. మొత్తానికైతే ఈమె షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు..
