E-Paper
Advertisement

చిన్న పిల్లలు చూడకూడని యానిమే సిరీస్… ఈ పిల్లులు చేసే పనులు చూస్తే నవ్వి నవ్వి పోతారు

చిన్న పిల్లలు చూడకూడని యానిమే సిరీస్… ఈ పిల్లులు చేసే పనులు చూస్తే నవ్వి నవ్వి పోతారు
Advertisement

Animated Comedy Series: చిన్న పిల్లులు, కార్టూన్ యానిమేషన్ అంటే సాధారణంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని అనుకుంటాం. కానీ ‘Alley Cats’ మాత్రం పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన అడల్ట్ యానిమేటెడ్ కామెడీ సిరీస్. ‘ది ఆఫీస్’, ‘ఎక్స్‌ట్రాస్’, ‘ఆఫ్టర్ లైఫ్’ వంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బ్రిటిష్ కమెడియన్ రికీ జెర్వైస్ ఈ సిరీస్‌ను క్రియేట్ చేయడంతో పాటు ప్రధాన పాత్రకు వాయిస్ ఇచ్చారు. రిలీజ్ చేసిన ఓటీటీలో కూడా దీనిని పెద్దలు మాత్రమే చూడాల్సిన డార్క్ కామెడీ కేటగిరీల్లో పడేసింది. మరి అడల్ట్స్ మాత్రమే చూడాల్సిన ఆ సిరీస్ ఏ ఓటీటీలోకి వచ్చింది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ మనుషుల ప్రపంచంలో వీధుల్లో తిరుగుతూ బతికే కొన్ని ఫెరల్ బ్రిటిష్ పిల్లుల చుట్టూ తిరుగుతుంది. వీటికి మనుషుల్లా మాట్లాడే స్వభావం ఉంటుంది. ఆహారం కోసం వెతుక్కోవడం, ఇతర పిల్లులతో గొడవపడటం, తమ మధ్య ఉండే స్నేహాలు, సంబంధాలు, రోజువారీ జీవితంలోని సమస్యలు ఇలా రకరకాల పరిస్థితులను ఈ పిల్లుల కోణంలో చూపిస్తారు. ముఖ్యంగా వీధుల్లో బతికే ఈ పిల్లుల గ్యాంగ్ జీవితాన్ని సీరియస్‌గా కాకుండా చాలా వింతగా, బోల్డ్ కామెడీతో చూపించడం ఈ సిరీస్ ప్రత్యేకత.

Advertisement

ఈ గ్యాంగ్‌ లో రికీ జెర్వైస్ వాయిస్ ఇచ్చిన గస్ అనే క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ప్యూక్, ఫ్యాంగ్, ఆలివ్, పోన్స్ వంటి ఇతర పిల్లులు కూడా కథలో కనిపిస్తాయి. వీరిలో కొందరు ఎప్పుడూ గొడవలకు దిగుతూ ఉంటే… మరికొందరు జీవితం, మరణం, ప్రేమ, ఒంటరితనం వంటి విషయాలపై తమదైన విచిత్రమైన తత్వాన్ని చెబుతూ ఉంటారు. ఒక వైపు పిచ్చి కామెడీ, మరోవైపు జీవితంపై సీరియస్ ఆలోచనలు కలపడం ద్వారా సిరీస్‌కు భిన్నమైన టచ్ ఇచ్చారు.

అయితే ఈ సిరీస్‌లో అసలు షాక్ ఇచ్చే విషయం కామెడీ స్టైల్. సాధారణ కార్టూన్లలో కనిపించే క్యూట్ జోక్స్ కాకుండా, బూతు మాటలు, అశ్లీల సూచనలు, సెక్స్‌కు సంబంధించిన జోక్స్, మరణం, శరీరంపై కామెడీ వంటి చాలా బోల్డ్ కంటెంట్ ఇందులో ఉంటుంది. అందుకే ఇది పిల్లల కోసం చేసిన యానిమేషన్ కాదని చెప్పాలి. అంతేనా సిరీస్‌లో అసభ్య పదజాలం, వల్గర్ జోక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

అయితే కేవలం బూతు కామెడీ మాత్రమే ఈ సిరీస్‌లో ఉండదు. తప్పిపోయిన ఒక చిన్న పిల్లి కథలోకి రావడంతో ఈ గ్యాంగ్ జీవితంలో భావోద్వేగ కోణం కూడా మొదలవుతుంది. పిల్లుల మధ్య స్నేహం, ఒంటరితనం, మరణం, జంతువులపై మనుషుల ప్రవర్తన వంటి అంశాలను కూడా రికీ జెర్వైస్ తనదైన సెటైరికల్ స్టైల్ లో చూపించాడు. అందుకే ఇది కేవలం నవ్వించడానికి మాత్రమే రూపొందించిన షో కాదు, సెటైరికల్ సోషల్ మెసేజ్ ఉన్న సిరీస్ కూడా. సిరీస్ ప్రత్యేకత ఏంటంటే యానిమేషన్ కూడా పాతకాలపు 2D కార్టూన్‌లను గుర్తు చేసేలా ఉంటుంది. ‘టాప్ క్యాట్’ తరహా రెట్రో ఫీల్‌తో కనిపించే విజువల్స్‌కు, రికీ జెర్వైస్ మార్క్ డార్క్ కామెడీ జత కావడం వల్ల ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది. .

ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి?

మొదటి సీజన్‌లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆరు ఎపిసోడ్లు ఒకేసారి ఆగస్ట్ 7న Netflixలో విడుదలయ్యాయి. ఈ సిరీస్ నార్మల్ ఫ్యామిలీ కార్టూన్ కాదు. పెద్దల కోసం రూపొందించిన అడల్ట్ యానిమేటెడ్ కామెడీ కావడంతో పిల్లలతో కలిసి చూడకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా బూతు మాటలు, అడల్ట్ జోక్స్, డార్క్ హ్యూమర్‌ను ఇష్టపడే వారికి మాత్రమే ఈ సిరీస్ సరిపోతుంది. మొత్తానికి సిరీస్ లో పిల్లుల రూపంలో కనిపిస్తాయి క్యారెక్టర్లు… కానీ వాటి మాటలు, పనులు మాత్రం పూర్తిగా పెద్దలు చేసినట్టే ఉంటాయి. రికీ జెర్వైస్ మార్క్ బోల్డ్ కామెడీని ఇష్టపడేవారికి ఇది కొత్త తరహా అడల్ట్ యానిమేషన్ అనుభూతిని ఇవ్వొచ్చు.

Read Also: కూతురు కోసం హంతకుడిని నిర్దోషిగా… ఓటీటీని దద్దరిల్లేలా చేసిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ తెలుగులో

Tags

Related News

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

కొడుకు తల్లికంటే బేబీసిట్టర్ కే ఎక్కువ దగ్గరైతే… గుండెను పిండేసే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా

ఇంట్లో గది అద్దెకు ఇస్తే ఇదేం రచ్చ భయ్యా… మళ్లీ మొదలైన నవ్వుల హంగామా

గతాన్ని మర్చిపోయి దాక్కున్న గ్యాంగ్‌స్టర్‌… ప్రేమ కోసం మళ్లీ తుపాకీ పడితే… యాక్షన్ క్రైమ్ డ్రామా

సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

పాట కోసం ప్రాణాలైనా ఇచ్చేంత పిచ్చి… కట్ చేస్తే పేరు తెచ్చిన పాటతోనే ఊహించని ట్విస్ట్… యూత్‌ఫుల్ మ్యూజికల్ డ్రామా

కూతురు కిడ్నాప్… పోలీసులు చేతులెత్తేయడంతో తండ్రి ఊచకోత…. హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×