Shaheen Afridi On Odi Captaincy: 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తానే పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని బల్ల గుద్ది ప్రకటించారు షాహిన్ అఫ్రిది (Shaheen Afridi). వన్డే కెప్టెన్ గా తానే కొనసాగుతానని.. ఇందులో ఎలాంటి మార్పు లేదంటూ తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 2027 వరల్డ్ కప్ గెలిచే లక్ష్యంగా పాకిస్తాన్ జట్టును సిద్ధం చేసేందుకు నేషనల్ ఛాంపియన్స్ కప్ (Pakistan National Champions Cup Trophy) నిర్వహిస్తోంది PCB. ఇందులో భాగంగానే ట్రోఫీని కూడా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ వన్డే కెప్టెన్ షాహిన్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పిస్తున్నారన్న వార్తలను కొట్టి పారేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 World Cup) పూర్తయ్యే వరకు తాను.. పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా కొనసాగుతానని కుండబద్దలు కొట్టి చెప్పారు. తన పదవికి ఎవరైనా అడ్డు వస్తే.. తొక్కుకుంటూ వెళ్తానని పరోక్షంగా హింట్ ఇచ్చారు. దీంతో బాబర్ ఆజం ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. షాహిన్ అఫ్రిదికి మళ్లీ పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ ఇస్తే.. వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని కామెంట్ చేస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంతో ప్రార్థిస్తాత్మకంగా నిర్వహించబోతున్న నేషనల్ ఛాంపినెస్ కప్ ట్రోఫీని (Pakistan National Champions Cup Trophy) తాజాగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా 2027 వన్డే వరల్డ్ కప్ కెప్టెన్సీ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షాహిన్ అఫ్రిది. చాలా రోజుల నుంచి తనను తప్పిస్తారని.. కొత్త వాళ్లకు వన్డే కెప్టెన్సీ వెళ్తుందని ప్రచారం జరుగుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. వన్డే కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని… జరిగే ప్రచారమంతా ఫేక్ అన్నారు. ప్రస్తుతానికైతే తానే వన్డే కెప్టెన్ అని ప్రకటించారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా తానే కెప్టెన్ గా ఉంటానని వెల్లడించారు.
ఇటీవల కాలంలోనే టెస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్న బాబర్ ఆజంకు వన్డేలతో పాటు టి20 కెప్టెన్సీ కూడా ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తానే కెప్టెన్ గా కొనసాగుతానని షాహిన్ అఫ్రిది ప్రకటించిన నేపథ్యంలో బాబర్ ఆజం తల పట్టుకుంటున్నారు. తనకు కెప్టెన్సీ ఇస్తే.. వన్డే వరల్డ్ కప్ గెలిపిస్తారని.. బాబర్ ఆజం చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. టీమిండియాను కూడా ఓడిస్తానని శపథం చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో షాహిన్ అఫ్రిది ప్రకటనతో బాబర్ గందరగోళంలో పడ్డాడు.
పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ పై ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వన్డే కెప్టెన్సీ విషయంలో ఇప్పటివరకు చర్చలు జరగలేదన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు షాహిన్ అఫ్రిది కెప్టెన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయని.. అంతర్గతంగా ఆయన హామీ ఇచ్చారు మొహ్సిన్ నఖ్వీ.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు