Gouri Priya Reddy on Casting Couch:గౌరీ ప్రియ రెడ్డి..ఈ పేరు ఇపుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్.కారణం సూపర్ హిట్ అయి ఏకంగా యాబయ్ కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన చెన్నై లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ భామే మరి.ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ బిజీగా గడిపేస్తుంది.ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌరీ ప్రియ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నదా అన్న ప్రశ్నకి ఇచ్చిన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు
విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలో మీ జర్నీ సాఫీగా సాగిందా లేక ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారా అన్న ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది గౌరీ ప్రియ.ఇక్కడ నేనొక్కటే బలంగా నమ్ముతాను. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఏ ఒక్కరో అనుకుంటే అది అయ్యేది కాదు.మనిషి అన్నాక క్లారిటీ ఉండాలి,మనిషి అన్నాక ధైర్యం ఉండాలి.మనకి ఏం కావాలో మనకి ఒక క్లారిటీ ఉంటె అప్పుడే మనల్ని దాటి ఎవరూ ఏం చేయలేరు.నాకు ఆ ధైర్యం,క్లారిటీ రెండూ ఉన్నాయ్.అని కుండ బద్దలు కొట్టేసింది.అంటే క్యాస్టింగ్ కౌచ్ జరగాలంటే ఇద్దరి ప్రమేయం ఖచ్చితంగా ఉండాలని తెల్చేసిందన్న మాట.
బడా దర్శకులు కన్సిడర్ చేస్తారా
ఇక కేవలం నటనకి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ మాత్రమే చేస్తారా లేక మాస్ కమర్షియల్ సినిమాలు కూడా చేస్తారా అన్న ప్రశ్నకి సమాధానం ఇస్తూ నటన కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ మాత్రమే చేస్తానని కూర్చుంటే డబ్బులు ఎలా అని సో ,అటు నా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండి,సినిమా కథ బాగుండి నా దగ్గరికి వచ్చిన ఏ మంచి సినిమా అయినా నేను చేస్తానంటూ మనసులోని మాటని బయటపెట్టింది ఈ తెలంగాణా బ్యూటీ.చూడాలి మరి పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలకి జోడీగా చేయాలని ఆశ పడుతున్న గౌరీని బడా దర్శకులు కన్సిడర్ చేస్తారో లేదో!
చెన్నై లవ్ స్టోరీతో తొలిసారి సాలిడ్ సక్సెస్
ఈ భామ విషయానికి వస్తే తెలంగాణాలోనే పుట్టిన ఈ గౌరీ ప్రియ మిస్ హైదరాబాద్ టైటిల్ గెలవడం విశేషం.ఇక మొదటగా షార్ట్ ఫిల్మ్స్ నటించి ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా వంటి సినిమాల్లో సైడ్ చేసినప్పటికీ,గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ఆహాలో విడుదలై సూపర్ హిట్ అయిన మెయిల్ సినిమానే .ఇక ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్, శ్రీకారం, లవ్ స్టోరీ వంటి సినిమాలు చేసిన గౌరీ ప్రియ మ్యాడ్ సినిమాతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చేసింది,ఎట్టకేలకి చెన్నై లవ్ స్టోరీతో తొలిసారి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ చూసిన ఈ భామ ముందు ముందు ఇంకెన్ని సక్సెస్ లని పలకరిస్తుందో!
also read :‘ఫౌజీ’లో ప్రభాస్ మదర్ ఎవరో తెలుసా?.. ఈ పేరు వింటే షాక్ అవుతారు!