E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!

హిట్టయినా రూపాయి మిగలలేదు! ‘క’ సినిమా వెనుక అసలు నిజాలు.. లాభపడింది ఆ కొందరే!
Advertisement

Ka Movie: ‘క ‘… టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ అండ్ మైండ్ బ్లోయింగ్ లో ఈ సినిమా ఒకటి .కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా  గతేడాది దీపావళి సీజన్లో అక్టోబర్ 31న థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.పీరియాడిక్ మిస్టర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూల్లనే  కొల్లగొట్టింది.

ముఖ్యంగా సినిమా రిలీజ్ కి ముందే నెగటివ్ ట్రోల్స్ ఫేస్ చేసిన కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో తన ఏంటో ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి.అయితే ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ,ఆర్టిస్టుల కెరీర్ గ్రాఫ్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది.అదేంటంటే ఆ సినిమాతో ప్రొడ్యూసర్స్ కి అనుకున్న స్థాయిలో డబ్బులు రాలేదని .

పెద్దగా లాభపడని మేకర్స్ 

Advertisement

అవును ..ఇందులో నటించిన నటీనటులకి మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోయే రేంజ్ లో పేరు తెచ్చి పెట్టింది . ఇక ఈ ప్రాజెక్టు వల్ల డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఊహించని లాభాలే వచ్చాయి .కాని 20 కోట్ల రూపాయలు  పెట్టిన మేకర్స్ మాత్రం పెద్దగా లాభపడింది ఏమీ లేదట.సాధారణంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీసినప్పుడు దానికి పెట్టే ఖర్చు ,బిజినెస్ లెక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ .సుజిత్ సందీప్ అనే ఇద్దరు కొత్త డైరెక్టర్లు ఈ కథని నమ్మి తెరకెక్కించారు. ఇక కిరణ్ అబ్బవరం కూడా తన మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం రిస్క్ చేశాడు .

కిరణ్ అబ్బవరంకి  మార్కెట్లో మంచి డిమాండ్

సినిమా కూడా  విడుదలయ్యాక పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ మెస్మరైజ్  అయిపోయారు .ఇక నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్లుగా  నటించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికి మంచి పేరే తీసుకొచ్చింది .ఈ సక్సెస్ తోనే హీరో కిరణ్ అబ్బవరంకి  మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది కూడా.మీటర్ సమ్మతమే ,దిల్ రూబా అంటూ ప్లాపులలో కురుకుపోయిన కిరణ్ కి ఈ సినిమా ఒక మంచి బూస్టర్ లా పని చేసిందని చెప్పాలి .

Advertisement

ఇక ఆర్టిస్ట్ పరంగా చూస్తే ఇండస్ట్రీలో మిగతావారి వారి గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. మరిన్ని కొత్త ఆఫర్స్ వచ్చి చేరాయి.అంటే రెమ్యూనరేషన్లతోపాటు  కంటే సినిమాల  పరంగా వీళ్లంతా సెటిలైపోయారన్నమాట. ఇక మా సినిమా 50 కోట్ల పైచిలుకు వసూలు చేసిందని ఊదరగొట్టారు కూడా.కానీ ప్రొడక్షన్ ఖర్చులు ,పబ్లిసిటీ ,విజువల్ ఎఫెక్ట్స్ కోసం పెట్టిన పెట్టుబడికి థియేటర్ మూసేసరికి వచ్చిన షేర్ కి మధ్య డిఫరెన్స్ చూస్తే మేకర్స్ కి పెద్దగా మిగిలిందేమీ లేదనేది ఇన్ సైడ్ టాక్ .

థర్డ్ పార్టీస్ కి లాభాలు తెచ్చిపెట్టిన ‘క’

ఇక సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చినా  వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ఎగ్జిబిటర్ల చేతులు మారడం వల్ల ఆ  ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు, లోకల్ బయ్యర్లు మాత్రమే సేఫ్ జోన్లోకి వెళ్లారట ముఖ్యంగా నైజాం ఆంధ్ర లోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ రేట్లకు రైట్స్ దక్కించుకున్న కొందరు డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది.దానికి తోడు డిజిటల్ రైట్స్, శాటిలైట్ కూడా కొందరికి మంచి లాభాలు అనే తెచ్చిపెట్టాయి .కాని పెట్టుబడి పెట్టిన నిర్మాతలకి ఏం మిగల్లేదు అన్నది ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ .మొత్తానికి కంటెంట్ హిట్ అయి, బిజినెస్ పరంగా థర్డ్ పార్టీస్ కి లాభాలు తెచ్చిపెట్టిన క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచిందన్న మాట .

Also read :రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు

Related News

అర్జున్ ‘బ్లాస్ట్’ సినిమా ఫార్ములాతోనే విక్టరీ వెంకటేష్ ఆదర్శకుటుంబం?

రాజమౌళి మళ్లీ ఆ ఛాన్స్ కొట్టేశాడు.. ఈ సారి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల పక్కన చోటు

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!

లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

Big Stories

×