E-Paper
Advertisement

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?

నితిన్ రుక్మిణిగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయ్యద్… ఆమె పాత్ర ఇదేనా?
Advertisement

Alias Rukmini: టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవల కాలంలో వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస డిజాస్టర్ సినిమాలు వెంటాడుతూ ఉన్నప్పటికీ ఈయన మాత్రం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే అలియాస్ రుక్మిణి(Alias Rukmini) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో రుక్మిణి ఎవరు అనే విషయాన్ని కూడా మేకర్స్ రివిల్ చేశారు.

టీచర్ పాత్రలో అఫియా సయ్యద్…

మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో నాని సమర్పణలో దీప్తి గంటా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్(Nithin) జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆఫియా సయ్యద్(Afiya Sayad) నటించబోతున్నారు. తాజాగా ఈమెను రుక్మిణిగా చిత్ర బృందం పరిచయం చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియో చూస్తుంటే ఇందులో రుక్మిణి ఒక స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. స్కూల్లో ఈమె చాలా స్ట్రిక్ట్ టీచరమ్మగా సందడి చేయబోతున్నారని తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చూస్తేనే స్పష్టం అవుతుంది.

డిజాస్టర్ హీరోతో టాలీవుడ్ ఎంట్రీ..

Advertisement

నితిన్ అలియాస్ రుక్మిణి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న ఆఫీయా సయ్యద్ తన మొదటి సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు నితిన్ డిజాస్టర్ హీరోగా పేరుపొందారు మరి డిజాస్టర్ హీరోతో కలిసి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే డిసెంబర్ 4వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఆఫియా విషయానికి వస్తే.. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు .

Advertisement

ఇటీవలే బాలీవుడ్ లో ప్రేమలు సినిమా రీమేక్ ప్రేమ కీటనుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అఫియా ఇప్పుడు అలియాస్ రుక్మిణి తో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. మరి తెలుగులో ఈమె ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.. ఇక ఈ సినిమాలో నితిన్ కృష్ణ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కామెడీ లవ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నైనా నితిన్ సక్సెస్ అందుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే డిసెంబర్ 4వ తేదీ నితిన్ అలియాస్ రుక్మిణి సినిమాతో పాటు నాగ చైతన్య వృషకర్మ సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతుంది.

Also Read: ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

Related News

భార్యతో గొడవలకు కారణం అదేనా? హర్ష చెముడు ఓపెన్ కామెంట్స్!

సుమతిగా సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. కల్కి 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్!

రాజాసాబ్ డిజాస్టర్‌పై తొలిసారి నోరు విప్పిన నిర్మాత.. ఏమన్నాడో తెలుసా?

ఆ సైజులు పెంచుతూ ఫోటోలు మార్ఫింగ్…AI ఫోటోల పై శ్రియ ఫైర్

కార్తికేయ ‘పర్ణశాల’ నుంచి జిమ్ జిమ్ తారా.. పాట అదిరిందిగా!

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

Big Stories

Advertisement
×