Fake COD Orders: సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఆశ కొందరి ప్రాణాల మీదకు.. మరికొందరి పరువు ప్రతిష్టల మీదకు తెస్తుంది. తాజాగా తమిళనాడులోని మధురైకి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ కు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీపావళి పండగ సందర్భంగా అభిమానుల నుంచి స్వీట్లు ఆశించిన అతనికి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. కొందరు ఆకతాయిలు చేసిన క్రూరమైన ప్రాంక్ కారణంగా అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.
దీపావళి పండగ పూట తన ఫాలోవర్స్ నుంచి స్వీట్లు స్వీకరించాలనే ఉద్దేశంతో వీరమణి అనే ఇన్ఫ్లుయెన్సర్ తన ఫోన్ నెంబరు, ఇంటి చిరునామాను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే, ఈ చిన్న పొరపాటే అతని పాలిట శాపంగా మారింది. ఫాలోవర్స్ స్వీట్లు పంపిస్తారనుకుంటే ఆకతాయిలు దీనిని ఒక అవకాశంగా మలచుకుని పెద్ద ప్రాంక్‌కు తెరలేపారు.
What began as a simple online request for a festive treat turned into a nightmare for a local content creator, forcing him to leave his house.
Known for his local slang and humorous social media posts, Madurai-based influencer Veeramani recently shared his residential address in West Anuppanadi, hoping a benevolent follower might send him a box of sweets for Deepavali after his request.
However, mischievous followers took advantage of the address to unleash a non-stop barrage of cash-on-delivery (COD) orders.
Delivery agents from e-commerce giants Amazon and Flipkart flooded his residence carrying expensive electronics, including washing machines, refrigerators, smartphones, and televisions. One high-value order for a television set was priced at Rs 1.69 lakh.
Since Veeramani had neither ordered the goods nor had the money to pay for them, he was unable to accept them or provide the required OTPs to the couriers. https://t.co/GsVuisoiyZ
— The Siasat Daily (@TheSiasatDaily) October 13, 2026
వీరమణి చిరునామాను ఉపయోగించి ఆకతాయిలు భారీ ఎత్తున క్యాష్ ఆన్ డెలివరీ (COD) ఆర్డర్లు చేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే అతని ఇంటి ముందుకు ఖరీదైన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలతో డెలివరీ బాయ్స్ క్యూ కట్టారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇలా ఒకటేమిటి.. అనేక వస్తువులు వచ్చాయి. ఒక్కో టీవీ ధర ఏకంగా రూ. 1.69 లక్షలు ఉండటం గమనార్హం. అంతేకాకుండా జేసీబీ ఎక్స్కవేటర్లు, మిలటరీ ట్యాంకుల వరకు ఫేక్ ఆర్డర్లు బుక్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇవే కాకుండా స్విగ్గీ, జొమాటోల ద్వారా ఫుడ్ డెలివరీలు కూడా వరుసగా రావడం అతడికి వెళ్లడం ప్రారంభమయ్యాయి.
కేవలం అర గంటల వ్యవధిలోనే సుమారు 15కి పైగా ఆర్డర్లు రావడంతో వీరమణి ఖంగుతిన్నాడు. ఆ వస్తువులను కొనుగోలు చేసేందుకు తన దగ్గర అంత డబ్బు లేదని, తాను ఎలాంటి ఆర్డర్లు చేయలేదని, అసలు డెలివరీ పూర్తి చేయడానికి కావాల్సిన ఓటీపీ (OTP) నెంబర్లు కూడా ఇవ్వలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తున్నారు? డెలివరీ బాయ్స్ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. దయచేసి ఆపండి’ అంటూ వీరమణి కన్నీటిపర్యంతమయ్యాడు. ఎలాంటి తప్పు చేయని డెలివరీ సిబ్బంది కూడా అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందాడు.
ఈ ఫేక్ ఆర్డర్ల గోల ఇంతటితో ఆగలేదు. వీరమణి ఫోన్ నెంబర్‌ను ఎవరో ఒకరు కిడ్నీ దానం కోసం దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ నెంబర్‌కు ఫోన్ చేసి కిడ్నీల గురించి ఆరా తీయడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కొందరైతే తనను నేరుగా దూషిస్తున్నారని వాపోయాడు.
Also Read: ‘లద్దాఖ్ మాది.. మీ వాదన చెల్లదు’.. చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన కేంద్రం!
ఈ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోవడంతో చేసేది లేక వీరమణి సోషల్ మీడియా ద్వారా మరో వీడియోను విడుదల చేశాడు. తన చిరునామాను ఉపయోగించి ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని మరోసారి విజ్ఞప్తి చేశాడు. తనపై వస్తున్న ఒత్తిళ్లు, విమర్శలు భరించలేక తాను తాత్కాలికంగా ఊరు విడిచి వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం సరదా కోసం చేసే ఇలాంటి ప్రాంక్‌లు అమాయకుల ప్రాణాలతో, మనశ్శాంతితో చెలగాటమాడతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
🚨 Viral Harassment! Influencer Veeramani Flooded With Fake COD Orders 😡 Tank, TV & More | Tamil Nadu
Madurai-based social media personality Veeramani Shanmuganathan is reportedly facing repeated unwanted Cash-on-Delivery (COD) orders, ranging from expensive electronics to an extraordinary tank order.
📦 What some people treat as online entertainment has become a serious source of distress for the recipient. Reports published on 9 October 2026 highlighted his appeal to stop the unwanted deliveries.
⚠️ The Bigger Problem: Fake orders waste delivery partners’ time, effort and fuel. They should not have to bear the consequences of online feuds and deliberate harassment.
Digital harassment can have real-world consequences, affecting a person’s privacy, peace of mind and sense of security. Claims that Veeramani is vacating his house have not been independently confirmed.
Brahmins TV – Unbowed. Unafraid.
#ViralNews #Veeramani #FakeCODOrders #TamilNadu #SocialMediaHarassment
— Brahmins TV (@BrahminsTV) October 10, 2026
Also Read: విమానాల్లో సిగరేట్‌పై నిషేధం.. కానీ బాత్రూమ్‌లో యాష్ ట్రేలు ఎందుకు? కారణం తెలిస్తే ఆశ్చర్యమే!