E-Paper
Advertisement

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్

అపార్ట్‌మెంట్‌లో అపరిచిత శవం… ప్రైమ్ వీడియోలోకి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్
Advertisement

Romantic Thriller OTT : ఒకరిని మొదటిసారి కలిసినప్పుడు కలిగే ఆకర్షణ, ఆ తర్వాత పెరిగే సాన్నిహిత్యం, ఒకరిపై మరొకరు పెట్టుకునే నమ్మకం.. ప్రేమకథల్లో ఇవన్నీ సహజంగా కనిపిస్తాయి. కానీ కొద్ది వారాల్లోనే బలంగా మారిన బంధం చివరకు హత్య మిస్టరీగా మారితే ? ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ లో గుర్తు తెలియని మృతదేహం బయటపడితే, ఆ వ్యక్తి ఎవరు, మరణానికి కారణం ఏమిటి, ఆ ఇంటితో సంబంధం ఉన్న ప్రేమజంటలో ఎవరు నిజం చెబుతున్నారు అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఇలాంటి డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ పేరే ‘ఫిఫ్టీ సిక్స్ డేస్’ (56 Days).

కథలోకి వెళ్తే…

సియారా వైస్ మిడిల్ క్లాస్ యువతి. ఒక అనుకోని పరిచయం ఆమెను సంపన్నుడైన ఒలివర్ కెన్నెడీకి దగ్గర చేస్తుంది. ఒలివర్ ఆకర్షణీయమైన వ్యక్తి. ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. వారి బంధం వేగంగా బలపడటంతో, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నామనే భావన వారిలో ఏర్పడుతుంది. అయితే ప్రేమలో ఉన్నప్పుడు కనిపించని కొన్ని నిజాలు, దగ్గరైన తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది.

Advertisement

ఈ జంట జీవితంలో జరిగిన సంఘటనలను కథ 56 రోజుల కాలవ్యవధిలో సినిమాలో చూపించారు. ఆ పరిచయం ఎలా మొదలైంది, వారి మధ్య సాన్నిహిత్యం ఎలా పెరిగింది, వారి సంబంధంలో ఏ మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాలను క్రమంగా బయట పెడుతుంది. 56 రోజుల తర్వాత ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో గుర్తుతెలియని మృతదేహం కనిపిస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు లీ రియర్డన్, కార్ల్ కానలీ, ఒలివర్, సియారా మధ్య ఉన్న సంబంధాలను పరిశీలించడం మొదలుపెడతారు.

ఆ మృతదేహం ఎవరిది అనే ప్రశ్నతో పాటు, ఈ జంట ప్రేమకథకు ఆ మరణంతో ఉన్న సంబంధం ఏమిటనేది ప్రధానంగా మారుతుంది. దర్యాప్తు అధికారులు గత 56 రోజుల్లో జరిగిన సంఘటనలను తిరిగి పరిశీలిస్తారు. జంట మధ్య జరిగిన సంభాషణలు, వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులు, బయటకు కనిపించని విషయాలు ఒక్కొక్కటిగా విచారణలో భాగమవుతాయి.

Advertisement

ఈ సిరీస్‌లో ప్రేమను కేవలం అందమైన అనుభూతిగా చూపించకుండా, దాని వెనుక ఉండే అసూయ, రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు, అనుమానాలను కూడా కథలో భాగం చేస్తారు. ఇంతకీ ఆ శవం ఎవరిది ? అసలు ఆ ప్రేమికులు ఇద్దరి మధ్య ఏం జరిగింది ? 56 రోజుల్లో ఏం జరిగింది? చివరికి ఏమైంది ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

Also Read : తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘ఫిఫ్టీ సిక్స్ డేస్’ 2026లో విడుదలైన ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో డవ్ కామెరాన్, అవాన్ జోగియా, కార్లా సౌజా కీలక పాత్రల్లో నటించారు. అయితే దీన్ని చిన్న పిల్లలతో కలిసి చూడకపోవడమే బెటర్ అని గుర్తు పెట్టుకోండి.

Related News

పెళ్ళైనట్టు నటిస్తూ ఇవేం మెంటల్ మాస్ పనులు భయ్యా… యాక్షన్, రొమాన్స్‌తో అదరగొట్టే కామెడీ సిరీస్

భర్త, ప్రాణ స్నేహితురాలు కలిసి చంపేశారు… గతంలోకి వెళ్ళిన భార్య వాళ్లకే పెళ్లి చేయాలనుకుంటే ? అదిరిపోయే కొరియన్ రివెంజ్ డ్రామా

దెయ్యాలనే నమ్మని యువతికి దడుచుకునే ట్విస్ట్… మస్ట్ వాచ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

హత్య వెనకున్న మతిపోగొట్టే మిస్టరీ… ఉత్కంఠ రేపుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ సీజన్ 24

తీగ తెగితే ప్రాణాలు పైకే… రియల్ లైఫ్ కేబుల్ కార్ ఇన్సిడెంట్… నరాలు కట్టయ్యే ట్విస్టులున్న సర్వైవల్ డాక్యుమెంటరీ

దెయ్యాల వేట – హాంటెడ్ స్కూల్… ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 4 హారర్ సినిమాలు, సిరీస్‌లు… తెలుగులో ఎన్ని చూడొచ్చంటే ?

పదేళ్లుగా ఇంట్లోంచి బయటకు రాని రచయిత్రి… కిల్లర్ కు తనను తానే ఎరగా వేసుకునే సాహసం… బుర్రపాడు సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×