E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నెట్టింట వైరల్ అవుతున్న లక్ష్మీ మంచు కామెంట్స్.. కలెక్షన్ కింగ్ వారసత్వం అంటే ఇదే మరి!

నెట్టింట వైరల్ అవుతున్న లక్ష్మీ మంచు కామెంట్స్.. కలెక్షన్ కింగ్ వారసత్వం అంటే ఇదే మరి!
Advertisement

Manchu Lakshmi’s Emotional: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఇండియాలోనే ఫస్ట్ ఎవర్ ఇన్ఫ్లుయెన్సర్ రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. జులై 3వ తేదీ నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఈ క్రేజీ రియాలిటీ షోకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నటి, హోస్ట్ మంచు లక్ష్మి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి.

విషయంలోకి వెళ్తే ఆమె, తెర వెనుక చేసే సామాజిక కార్యక్రమాల గురించి చాలా మందికి తెలియవు. ఇటీవలి కాలంలో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు ఆమె అందిస్తున్న సాయం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, తను చేసే ప్రతి సామాజిక సేవను సోషల్ మీడియాలో పెట్టడానికి ఆమె ఇష్టపడరు. దీని వెనుక ఒక బలమైన కుటుంబ నేపథ్యం మరియు ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. లక్ష్మీ మంచు ఈ సేవా గుణాన్ని ఎవరినో చూసి నేర్చుకోలేదు, అది ఆమెకు పుట్టుకతోనే తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నుండి వారసత్వంగా వచ్చిందని చెప్పుకొచ్చింది .

ఎన్నో అవసరాలు తీర్చిన మోహన్ బాబు 

Advertisement

మంచు కుటుంబం చెన్నై (నాటి మద్రాస్) లో ఉన్న రోజుల్లో, వారి ఇంటికి తరచూ ఎంతో మంది కొత్త వ్యక్తులు వచ్చేవారు. వారు కేవలం చుట్టాలో, స్నేహితులో కాదు. ముఖం ముక్కు తెలియని ఎంతో మంది పేదలు, సాయం కోసం వచ్చే వారు  ప్రతి రెండు మూడు నెలలకొకసారి వారి ఇంటి తలుపు తట్టేవారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ మోహన్ బాబు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారి అవసరాలను తీర్చేవారు. ఊరి నుండి వచ్చిన వారికి ఇళ్లు, వాహనాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ, సొంత కుటుంబ సభ్యుల కంటే మిన్నగా ఆదరించేవారు. కేవలం తమ కుటుంబానికే కాకుండా, చుట్టుపక్కల గ్రామాల్లోని బావులు తవ్వించడం, వసతులు కల్పించడం వంటి పనులను మోహన్ బాబు స్వయంగా చూసేవారని తెలిపింది .

పేద విద్యార్థుల చదువుకు స్పాన్సర్

చిన్నతనంలో లక్ష్మీ మంచుకు ఇదంతా చాలా వింతగా అనిపించేది. తమకు సంబంధం లేని వ్యక్తుల కోసం తండ్రి ఎందుకు అంతలా తపిస్తున్నారో అప్పట్లో ఆమెకు అర్థమయ్యేది కాదు. కానీ, కాలక్రమేణా ఆ వాతావరణంలోనే పెరగడం వల్ల ఇతరులకు సహాయం చేయడం అనేది ఆమె జీవితంలో ఒక భాగమైపోయింది. విద్యా రంగానికి, క్రీడలకు మోహన్ బాబు ఇచ్చే ప్రాధాన్యతను చూస్తూ పెరిగిన లక్ష్మి, సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్య ఎంత అవసరమో గ్రహించారు. అందుకే విద్యాసంస్థల నిర్వహణలోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు ఆమె స్పాన్సర్ చేస్తున్నారట.

డిజిటల్ విద్యను అందిస్తూ సరికొత్త విప్లవం 

Advertisement

కలెక్టింగ్ కింగ్ మోహన్ బాబు కేవలం సినిమాల్లోనే డైలాగ్ కింగ్ కాదు, నిజ జీవితంలోనూ ఎంతో మందికి 1993 లో ఆయన స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ద్వారా వేలాది మందికి ఉచిత విద్యావకాశాలు కల్పించారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, లక్ష్మీ మంచు ‘టీచ్ ఫర్ చేంజ్’ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందిస్తూ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నారు.. సినిమా గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న లక్ష్మీ మంచు నిజంగా నేటి యువతరానికి ఒక గొప్ప రోల్ మోడల్ అని చెప్పవచ్చు.

Related News

‘రంగస్థలం’ మహేశ్‌కి ఏమైంది? సడన్‌గా అంత మాట అనేశాడు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!

యూరప్ టూర్‌కు రాజమౌళి సిద్ధం.. ‘RRR’ నుంచి ‘ఈగ’ వరకు స్పెషల్ స్క్రీనింగ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!

సుకుమార్ సినిమాలో చేయాలంటే ఈ హీరోయిన్ ఎన్ని కండీషన్స్ పెట్టిందో తెలుసా ?

మిగతా హీరోలు సెట్స్ పైకి.. మోక్షజ్ఞ మాత్రం ఇంకా ముహూర్తాల వేటలోనే!

సమంత వన్-వుమెన్ షో.. స్టార్ హీరోల రికార్డులను తిరగరాస్తోన్న ‘మా ఇంటి బంగారం’!

ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం.. జ్యోతిష్యుడి మాట నిజమైందా?

చిన్న వయసులోనే ఫిలింఫేర్ రికార్డ్.. మూడు సిల్వర్ జూబ్లీల హ్యాట్రిక్.. అదీ ఉదయ్ కిరణ్ రేంజ్

కన్నడ స్టార్ దర్శన్ కొడుకు లగ్జరీ కారు యాక్సిడెంట్.. అసలేం జరిగిందంటే?

Big Stories

×