E-Paper
Advertisement

తారక్‌ కూడా అదే రూట్‌లోకి.. మరో కుంపటి రెడీ!

తారక్‌ కూడా అదే రూట్‌లోకి.. మరో కుంపటి రెడీ!
Advertisement

NTRTAIN Production:టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోల చేతిలో సినిమాలతో పాటు సొంత బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. నచ్చిన కథలను ప్రొడ్యూస్ చేయడం,కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడం కోసం చాలామంది స్టార్లు ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ‘NTRTAIN’ పేరుతో తారక్ సొంత ప్రొడక్షన్ హౌస్‌ ఏర్పాటు చేయబోతున్నారనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

2025 మార్చి 17న హైదరాబాద్‌లో సంస్థ రిజిస్టర్

NTRTAIN ని అంటే NTRకి ENTERTAINMENT కలిపితే వచ్చిన పేరని ,పేరు వింటేనే తారక్ బ్రాండ్ కనిపించేలా ఉండాలని ఈ పేరు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.ఇక NTRTAIN LLP పేరుతో ఒక సంస్థ రిజిస్టర్ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది.అది కూడా 2025 మార్చి 17న హైదరాబాద్‌లో ఈ సంస్థ రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఇందులో తారక్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి నందమూరి పేర్లు డిజిగ్నేటెడ్ పార్ట్‌నర్లుగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్.అయితేకేవలం తన సినిమాలను నిర్మించుకోవడానికే ఈ సంస్థను ఉపయోగిస్తారా? లేక కొత్త దర్శకులు, కొత్త హీరోలు, కొత్త కథలు, కొత్త టెక్నీషియన్లను పరిచయం చేసేలా బ్యానర్‌ను డెవలప్ చేస్తారా? అన్నది కాలం గడిస్తే కాని తెలిసేలా లేదు.

ఇప్పటికే ఉన్న కళ్యాణ్ రామ్‌కు చెందిన NTR Arts 

Advertisement

ఇక్కడ మరో విషయం ఏంటంటే . తారక్ కుటుంబానికి నిర్మాతగా బ్యాక్‌గ్రౌండ్ కొత్తది కాదు. నందమూరి కళ్యాణ్ రామ్‌కు చెందిన NTR Arts బ్యానర్ ఇప్పటికే పలు సినిమాలు నిర్మించింది. తారక్ నటించిన ‘జై లవకుశ’ కూడా ఇదే బ్యానర్ నుంచి 2017 సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

అయితే NTRTAIN మాత్రం మరో కోణంలో ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇది తారక్‌కు వ్యక్తిగతంగా మరింత కనెక్ట్ అయిన ప్రొడక్షన్ బ్రాండ్‌గా ఎదిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తారక్ టీమ్ నుంచి రావాల్సిన క్లారిటీ 

Advertisement

అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు NTRTAIN గురించి వస్తున్న ప్రతి విషయాన్ని ఫైనల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సంస్థ రిజిస్ట్రేషన్, ట్రేడ్‌మార్క్‌కు సంబంధించిన వివరాలు ఆసక్తిని పెంచుతున్నా.. అసలు ప్రొడక్షన్ ప్లాన్ ఏంటి? తొలి సినిమా ఏది? ఎప్పుడు ప్రారంభిస్తారు? వంటి ప్రశ్నలకు తారక్ టీమ్ నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.

also read :బాలయ్య NBK 112 ఆగిపోయిందా? కొరటాల నెక్స్ట్ ఏంటి?

ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Dragon’ప్రాజెక్ట్‌ లో నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాను 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తారక్ చేయబోయే గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కూడా లైనప్ లో ఉంది .అంటే.. హీరోగా తారక్ మార్కెట్ ఇప్పటికే ఒక స్థాయిని దాటిపోయింది. ఇలాంటి సమయంలో ప్రొడక్షన్‌లోకి వస్తే.. తన స్టార్ పవర్‌ను కంటెంట్ క్రియేషన్‌కు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్న మాట. చూడాలి మరి చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజమెంత ఉందో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×