E-Paper
Advertisement

బాలయ్య NBK 112 ఆగిపోయిందా? కొరటాల నెక్స్ట్ ఏంటి?

బాలయ్య NBK 112 ఆగిపోయిందా? కొరటాల నెక్స్ట్ ఏంటి?
Advertisement

Koratala Siva: కొరటాల శివ గ్రాఫ్ చూస్తుంటే నిజంగానే బ్యాడ్ టైమ్ నడుస్తునట్టు కనిపిస్తుంది.అవును..ఒకప్పుడు ‘మిర్చి’ నుంచి ‘భరత్ అనే నేను’ వరకు వరుసగా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లు కొడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన కొరటాల ఇపుడు బాలయ్య సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు.ఇక ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం అసలీ సినిమా సెట్స్ పైకి వెళ్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.

గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మొదలు 

నిజానికి బాలయ్యకి ఒక పవర్‌ఫుల్ లైన్ చెప్పి బాలయ్యను ఒప్పించి, NBK 112 ప్రాజెక్టును గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మొదలెట్టేశాడు కొరటాల .ఇక సినిమా కూడా పరుగులు పెడుతుంది అనుకున్నారు. కానీ, వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా మొదలయ్యేలా కనిపించడం లేదట.అవును .. స్క్రిప్ట్ విషయంలో బాలయ్య ఇంకా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదని, కథలో మరిన్ని మార్పులు చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. కొరటాల దాన్ని మళ్ళీ బెటర్‌గా రీ-రైట్ చేస్తారా లేక గతంలో అల్లు అర్జున్‌తో అనుకున్న సినిమా ప్రకటన దాటిపోయాక ఆగిపోయినట్టే, ఇది కూడా పక్కకు వెళ్తుందా అనే చర్చ ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా నడుస్తోంది.

‘ఆచార్య’ కొట్టిన దెబ్బకి టోటల్ డ్యామేజ్

Advertisement

వాస్తవానికి ఈ సినిమా కొరటాలకి అంత ఈజీగా రాలేదు. ‘ఆచార్య’ కొట్టిన దెబ్బకి ఆయన ఇమేజ్‌, బ్రాండ్ వ్యాల్యూని టోటల్ డ్యామేజ్ అయిపొయింది.అయితే జనతా గ్యారేజ్ వంటి సాలిడ్ హిట్ ఇచ్చావ్ గా అంటూ డీలా పడ్డ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సాలిడ్ హిట్ కొట్టినప్పటికీ కంటెంట్ విషయంలో యునానిమస్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ స్లో గా సాగడం, రొటీన్ స్క్రీన్ ప్లే కావడంతో విమర్శల వర్షం కురిసింది.

కొరటాలని బాలయ్య కరుణిస్తాడో లేదో

దాని కారణంగానే దేవర సీక్వెల్ వెంటనే సెట్స్ మీదకు వెళ్ళలేదన్న టాక్ ఉంది. ఈలోగా ఎన్టీఆర్ తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్ 2’ పూర్తి చేసి, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీ అయిపోయారు. తారక్ బర్త్ డేకి కూడా దేవర-2 పోస్టర్ గానీ, చిన్న అప్‌డేట్ గానీ రాకపోవడంతో ఈ సీక్వెల్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడిపోయిందని అందరికీ క్లారిటీ వచ్చింది.

Advertisement

also read :షూటింగ్‌లో లేట్, సెట్‌లో ఫోన్.. అసలు విషయాలు కక్కేసిన సెలబ్రిటీలు

దీంతో ఇలా కాదంటూ బాలయ్య వైపు దిక్కులు చూసిన కొరటాల మొతానికి సినిమా ఒకే చేయించుకున్నప్పటికీ ఇదిగో ఇలా మూడడుగులు ముందుకు వేస్తె ముప్పయి అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి.చూడాలి మరి ఈసారి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కొరటాలని బాలయ్య కరుణిస్తాడో లేదో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×