Nidhhi Agerwal:ఆన్లైన్ బెట్టింగ్ , గేమింగ్ యాప్ ల ప్రమోషన్ల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రానా (Rana), ప్రకాష్ రాజ్(Prakash Raj), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వంటి బడా సెలబ్రెటీలు ఈడీ అధికారుల ముందు హాజరుకాగా.. ఇప్పుడు నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కూడా బుధవారం ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా నిధి హైదరాబాదులోని ఈడీ కార్యాలయానికి రావడం అక్కడ ఆమెను పోలీసు భద్రతతో ప్రాంగణంలోకి తీసుకెళ్లడం చూడవచ్చు.
విషయంలోకి వెళ్తే.. గతంలో నమోదైన కేసు ఆధారంగా ఆర్థిక నేరాల కోణంలో ఈ దర్యాప్తును ముందుకు తీసుకు వెళుతుంది. అక్రమ బెట్టింగ్ ఫ్లాట్ ఫారమ్ లకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగానూ నిధి అగర్వాల్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని, ఆ డబ్బును హవాల రూపంలో పొంది లెక్కల్లో చూపించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు ఈడీ నోటీసులు ఇవ్వగా.. ఆమె నేడు అధికారుల ముందు హాజరయ్యారు.
ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. పైగా ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేయబోతున్నారట. ఇకపోతే సుమారుగా 14కి పైగా ఆన్లైన్ బెట్టింగ్, జూదం యాప్ లకు ప్రచారం కల్పించిన కేసులో పలువురు సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్స్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. PMLA చట్టం కింద విచారణ జరుగుతోంది.. ఇకపోతే విచారణ తర్వాత నిధి అగర్వాల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ALSO READ:యువతితో రెడ్ హ్యాండెడ్ గా గదిలో భార్యకు దొరికిపోయిన ఫోక్ డ్యాన్సర్!
అసలు విషయంలోకి వెళ్తే.. 2025 మార్చి 19న 32 ఏళ్ల వ్యాపారవేత్త వీ.ఎం.ఫణీంద్ర శర్మ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నిధి అగర్వాల్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. 1867 నాటి పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టాన్ని ఉల్లంఘించే చట్ట విరుద్ధమైన జూదం యాప్ లను పలువురు ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్నారనే ఆందోళనకరమైన ధోరణి ఉందని తన ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. తన కమ్యూనిటీలోని యువకులతో సంభాషణ సందర్భంగా సోషల్ మీడియా ప్రముఖులు విపరీతంగా ప్రచారం చేసిన ఈ జూదం యాప్ లలో తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి చాలామంది వ్యక్తులు ప్రభావితులయ్యారని తాను కనుగొన్నట్టు శర్మ పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత ,అనన్య నాగళ్ళ, శ్రీముఖి , సిరి హనుమంతు, వర్షిని సౌందర్యరాజన్ , ప్రకాష్ రాజ్ , నిధి అగర్వాల్తో పాటు అనేకమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో సహా చాలామంది ప్రముఖుల జాబితాను పోలీసులు విడుదల చేశారు.