Ajay Ghosh:నవదీప్ (Navdeep).. ఈ పేరు గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు కొన్ని చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఇటీవల బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 కి జడ్జిగా వ్యవహరించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలు, షోల కంటే కాంట్రవర్సీ మాటలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి నవదీప్ గురించి ప్రముఖ యాక్టర్ అజయ్ ఘోష్ (Ajay Ghosh) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నవదీప్ కి వందల కోట్ల ఆస్తి ఉండేదని, కానీ అదంతా కోల్పోయారు అంటూ ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. రాయలసీమ నేపథ్యంలో యధార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న మ్యూజికల్ ఎమోషనల్ లవ్ స్టోరీ మొహబ్బత్. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నవదీప్, టాలెంటెడ్ డైరెక్టర్ కరుణకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నవదీప్ గురించి అజయ్ ఘోష్ మాట్లాడుతూ..” నవదీప్ వాళ్ళ నాన్న రామారావు గారు. 2002లోనే చీరాల బీచ్ దగ్గర రామాపురం రిసార్ట్స్ కట్టారు. ఆ తర్వాత ఆయన హైదరాబాదు వచ్చేస్తూ.. ఆ రిసార్ట్ ను అమ్మేశారు. అయితే అది అమ్మకుండా ఉండుంటే.. ఈరోజు వందల కోట్ల అయ్యుండేది. ఇప్పుడు అక్కడికి వెళ్లి చూసిన ప్రతిసారి.. అరే ఇది మన నవదీప్ ది కదంటరా సామీ అని అనుకుంటూ ఉంటాను. వాళ్ళ మామ లీలా ప్రసాద్ .. నా క్లాస్మేట్ అంటూ ఆ రిసార్ట్ ను అమ్మక పోయి ఉండుంటే నేడు నవదీప్ ఆస్తి వందల కోట్లు ఉండేది అంటూ అజయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మొహబ్బత్ సినిమా విషయానికి వస్తే.. సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా ఏబిఎస్ ప్రొడక్షన్స్ పతాకం పై మ్యాక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మొహబ్బత్. ఈ చిత్రానికి అఫ్రోజ్ షేక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సలీం షేక్ , సినిమాటోగ్రాఫర్ గా వైఎస్ కృష్ణ, రచయితగా కలాం పనిచేస్తున్నారు. ఇందులో ఈశ్వర్ సాయి, అజయ్ ఘోష్ , మనోజ్, సాత్విక్ , సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ముఖ్యంగా ఫోక్ సాంగులతోనే కాకుండా.. మాధురి రాథోడ్ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ఈశ్వర్ సాయి ఈ సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
also read:హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని.. ఆమె రియాక్షన్?
నవదీప్ మాట్లాడుతూ.. ఒక సామెత గురించి చెప్పి ఒక గదిలో అత్యంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల గురించి చెప్పాలి అంటే నా దృష్టిలో ఇక్కడ ఈ స్టేజ్ పైన ఏనుగు అజయ్ ఘోష్ గారు. అంటే సైజు కాదు క్యారెక్టర్. ఒక మనిషి సభలో ఉన్నా.. షూటింగ్లో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. ఏ ఫిల్టర్ లేకుండా తన మనసులోని మాటను నిర్భయంగా బయటకు చెప్పగలుగుతున్నారు. మేము నటించలేక చచ్చిపోతున్నాం సార్.. వీళ్ళ ముందు ఏం మాట్లాడాలో.. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో.. బయటకు వెళ్తే ఎక్కడ ఏ మాట కాంట్రవర్సీ అవుతుందో భయం వేస్తోంది. ఎక్కడ ఉన్నా సరే తన మనసులో మాటను నిర్భయంగా చెప్పడం అనేది చాలా గొప్ప విషయం.. మీ నుంచి నేను ఈ విషయం నేర్చుకున్నాను అంటూ తెలిపారు నవదీప్.