Rachita Ram:ఒకప్పుడు సెలబ్రిటీలను కలవాలన్నా.. చూడాలన్నా.. చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయింది. సెలబ్రిటీలే అభిమానులను కలవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది లైవ్ చిట్ చాట్ అంటూ అభిమానులతో నేరుగా మాట్లాడుతుంటే.. మరికొంతమంది డైరెక్ట్ గా అభిమానులను కలుస్తూ సందడి చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. అభిమానులు మాత్రం సెలబ్రిటీలు కనిపిస్తే వారితో సెల్ఫీ దిగడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి , కరచాలనం చేయడానికి తెగ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.
మరి కొంతమంది అభిమానులు కాస్త హద్దులు కూడా మీరుతున్న విషయం తెలిసిందే. అభిమాని కదా అని సెల్ఫీ దిగడానికి కాస్త చనువు ఇస్తే చాలు.. వారు ఏకంగా వారిని అసభ్యకరంగా తాకుతూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలవాలని వస్తే.. ఒక అభిమాని కాస్త హద్దులు దాటి మరీ ఆమె బుగ్గలు గిల్లి ఆశ్చర్యపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ రచితా రామ్ (Rachita Ram). ప్రధానంగా కన్నడ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తెలుగులో తొలిసారి ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి దర్శకత్వంలో వస్తున్న ‘కాకా’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు వరుసగా కన్నడలో సినిమాలు చేస్తూ.m బిజీగా మారిన ఈమె.. తన పుట్టినరోజు (అక్టోబర్ 3) సందర్భంగా అభిమానులను కలుసుకుంది. నిజానికి ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడం అలవాటున్న రచితా రామ్ ..ఈ ఏడాది కూడా అభిమానులను కలవడానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెను చూడడానికి చాలామంది అభిమానులు వచ్చారు. వారితో ఫోటోలు దిగుతూ, సెల్ఫీలు ఇస్తూ సందడి చేసింది.
ఈ సందర్భంగా ఒక అభిమాని ఈమె దగ్గరకు వచ్చి ముందుగా ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా రచితా రామ్ రెండు బుగ్గలను పట్టుకొని గిల్లాడు. దీంతో ఒక్కసారిగా హీరోయిన్ షాక్ అయింది. అయితే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక.. మొదట ఆశ్చర్యపోయినా.. ఆ తరువాత చాలా సింపుల్ గా నవ్వేసి, వివాదాలకు చోటు ఇవ్వకుండా తన సహనాన్ని కనబరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
also read:‘చుట్టమల్లే’ ఏఐ వివాదంపై జాన్వీ కపూర్ రియాక్షన్.. శిక్ష తప్పదంటూ హెచ్చరిక!
ఈ వీడియో పై కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారిని తాకడం సరైన పద్ధతి కాదు అంటూ అభిప్రాయపడుతున్నారు.. రచితా రామ్ విషయానికి వస్తే.. దక్షిణాది భాషల్లో తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తమిళంలో రజనీకాంత్ హీరో నటించిన కూలీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం రావణుడి కోసం వెతుకుతున్న శబరి, లవ్ మీ ఆర్ హేట్ మీ వంటి చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని.. విడుదలకు సిద్ధమవుతున్నాయి.