E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!

నా జీవితాన్ని మార్చిన దేవుడు – ఐశ్వర్య రాజేష్!
Advertisement

Aishwarya Rajesh:దివంగత నటుడు రాజేష్ కూతురిగా, చైల్డ్ ఆర్టిస్ట్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘రాంబంటు’ అనే చిత్రంతో బాలనటిగా తన కెరియర్ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తమిళంలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్.. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా అవకాశాలు అందుకొని.. కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలా కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన సమయంలోనే తెలుగులో మళ్లీ అదే రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో.. ఆయన కూతురిగా కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందరి దృష్టిని ఆకట్టుకుంది.

జీవితాన్నే మార్చేసిన మూవీ..

ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ అంటూ పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. కానీ గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కుటుంబ కథా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది. ఇందులో భాగ్యం పాత్రతో తన నటనకు ప్రాణం పోసింది. ప్రస్తుతం ఇసకపట్నం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవైపు ఈ వెబ్ సిరీస్ కి పాజిటివ్ టాక్ వినిపిస్తుంటే.. ఇటు వరుస ప్రమోషన్స్ లో బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే తన కెరీర్ కు ఊపిరి పోసింది ఆయనే అని, 35 సినిమాల ద్వారా రాని గుర్తింపు.. ఆ ఒక్క చిత్రంతో లభించింది అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

also read:పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

35 సినిమాలతో రాని గుర్తింపు..

ఇసకపట్నం వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ కి ” మీరు కెరియర్ ప్రారంభించి ఎంతో కాలం అయ్యింది.? ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించారు. కానీ మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే భారీ గుర్తింపు వచ్చిందని అందరూ అంటున్నారు.. మీరు కూడా అదే అనుకుంటున్నారా?” అని ప్రశ్నించగా.. ఐశ్వర్య మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నేను దాదాపుగా 35 సినిమాల్లో నటించాను. అయితే ఆ 35 చిత్రాల ద్వారా దాని గుర్తింపు ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో లభించింది. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా ఇందులో నేను పోషించిన పాత్ర అటు చిన్న పిల్లల నుండి ఇటు పెద్దవారి వరకు అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇలాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు అనిల్ రావిపూడికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితాన్ని మార్చేసి నా కెరియర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దేవుడు” అంటూ ప్రశంసలు కురిపించింది.

ఓ ..! సుకుమారి అంటున్న ఐశ్వర్య రాజేష్..

Advertisement

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఈ పాత్ర దక్కడం నా అదృష్టం.. నా కెరియర్ లో ఎప్పటికీ చాలా ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోతుంది ” అంటూ తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె తిరువీర్ హీరోగా నటిస్తున్న ఓ..! సుకుమారి చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా జూలై 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమ ఐశ్వర్యాకు ఇంకెలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

గ్లోబల్ లెవెల్‌లో గౌరవం… రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ !

విశ్వంభర వచ్చేస్తోంది.. చిరు సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే

మూడేళ్ల గ్యాప్ పై అఖిల్ రియాక్షన్.. 48 కుట్లు.. 2 సర్జరీలు అంటూ!

లెక్చర్లు లేవు.. డైరెక్ట్ కౌంటర్! కాలేజీ ఈవెంట్‌లో అలియా భట్ మాస్ పంచ్.. వైరల్ వీడియో!

పెళ్లే వద్దన్న బ్యూటీ.. బిడ్డల్ని కనాలనుందంటోందేంటి ?

జైలర్ 2 రిలీజ్ డేట్.. కౌంట్ డౌన్ మొదలుపెట్టిన మేకర్స్!

నోలన్ మార్క్ విజువల్ వండర్: ‘ది ఒడిస్సీ’ ఫైనల్ ట్రైలర్ అవుట్.

Big Stories

×