E-Paper
Advertisement

అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?

అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?
Advertisement

HBD Allari Naresh:అభిమానులు “అల్లరోడు” అంటూ ముద్దుగా పిలుచుకునే అల్లరి నరేష్(Allari Naresh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అటు కామెడీ ఆడియన్స్ ను ఇటు ఫ్యామిలీ అభిమానులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ (EVV Sathya Narayana) వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్.. ‘అల్లరి’ అనే చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

మొదటి సినిమానే తనకు మంచి విజయాన్ని అందించడంతో సినిమా టైటిల్ ని ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ గా ఇండస్ట్రీలో సెటిలైపోయారు. 55కు పైగా చిత్రాలలో నటించి, విభిన్న హాస్య పాత్రలకు పేరుగాంచిన అల్లరి నరేష్.. రెండేళ్లు గ్యాప్ తీసుకొని 2021లో ‘నాంది’ అనే చిత్రంతో రీఎంట్రీలో సీరియస్ పాత్ర ఎంచుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇన్ని రోజులు కడుపుబ్బా నవ్వించిన నరేషా ఇక్కడ నటించింది అనే రేంజ్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా నరేష్ కి పెద్దగా వర్కౌట్ కాలేదు.

నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా..

Advertisement

ఇక ఆ తర్వాత వచ్చిన మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, నాసామిరంగా, ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమిల్లి , 12 A రైల్వే కాలనీ ఇలా ఎన్నో చిత్రాలు చేస్తున్నారు. కానీ పూర్వ వైభవాన్ని అందుకోవడంలో కాస్త వెనకడుగు వేస్తున్నారనే చెప్పాలి. ఇక అలాంటి ఈయన ప్రస్తుతం సభకు నమస్కారం, ఆల్కహాల్ వంటి చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న అల్లరి నరేష్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా గత ఇంటర్వ్యూలలో తన కెరీర్లో తనకు బ్లాక్ బాస్టర్ ఇచ్చిన మూవీని ఇప్పటివరకు చూడలేదని , ఇక భవిష్యత్తులో కూడా చూడను అంటూ చెప్పిన విషయం మళ్లీ వైరల్ గా మారింది. అల్లరి నరేష్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

also read:నడిరోడ్డుపై బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు.. ఆకతాయి అసభ్యకర ప్రవర్తన.. వీడియో వైరల్!

విషాదాన్ని నింపిన మూవీ..

Advertisement

గత ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు నరేష్ మాట్లాడుతూ..” మా నాన్న 2011 జనవరి 21న తుది శ్వాస విడిచారు. హాస్పిటల్లో నాన్న చికిత్స పొందుతున్నప్పుడు సీమ టపాకాయ్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో పాల్గొనాలి. ఆ రోజు వదిలితే మిగిలిన స్టార్ కమెడియన్స్ డేట్స్ దగ్గర్లో ఖాళీ లేవు. అందుకే ఆరోజు ఎలాగైనా సరే షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఒకవైపు నాన్న ఆరోగ్య పరిస్థితి నన్ను మానసికంగా కృంగదీస్తుంటే.. మరొకవైపు నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఆరోజు షూటింగ్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది.

తప్పని పరిస్థితుల్లో నాన్నకి ఒకవైపు వైద్యులు సీరియస్ గా ఉందని చెబుతున్నా.. ఏడుపు వస్తున్నా..కామెడీ సీన్స్ తో షూట్ చేశాను. ఎలాగోలా సాయంత్రానికి షూటింగ్ అయిపోయింది. మా దురదృష్టం ఏమిటంటే అదే రోజు సాయంత్రం నాన్న కన్నుమూశారు. అందుకే ఇప్పటివరకు కూడా నేను ఆ సినిమా చూడలేదు. ఇకపై చూడను. ఆ సినిమాను తలుచుకుంటే నాకు మా నాన్న మరణమే గుర్తొస్తుంది” అంటూ ఎమోషనల్ అయ్యారు నరేష్. ఇక అల్లరి నరేష్ పూర్ణ కాంబోలో వచ్చిన ఈ సీమ టపాకాయ్ 2011 మే లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

Related News

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×