E-Paper
Advertisement

51 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే ఉంటా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

51 ఏళ్లొచ్చినా సింగిల్‌గానే ఉంటా.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
Advertisement

Ameesha Marriage: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు.అలా జరిగితేనే బాగుంటుంది కూడా.కానీ 51 ఏళ్ల వయసులో అడుగుపెట్టినా కూడా ఇంకా మూడు ముళ్ళు వేయించుకోకుండా జాలీగా లైఫ్ ని గడిపేస్తుంది బాలీవుడ్ వెటరన్ బ్యూటీ అమీషా పటేల్. అంతే కాదండోయ్ ..పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే అబ్బే అసలు నా జీవితంలో పెళ్లి అనే చాప్టర్ లేనేలేదు అంటూ కుండబద్దలు కొట్టేస్తుంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో అభిమానులతో సరదాగా చిట్‌చాట్ చేస్తుండగా ఓ నెటిజన్.. “మేడమ్.. ఇంతకాలం అయింది.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?” అని అడిగాడు. చాలామంది హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలు వస్తే దాటవేస్తారు. కానీ అమీషా మాత్రం ఏమాత్రం మొహమాటపడకుండా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసింది.

Advertisement

“నేను సింగిల్‌గా చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ఎక్కడో ఉన్న ఓ వ్యక్తి వచ్చి నా జీవితాన్ని, నా స్వేచ్ఛను మార్చేయాల్సిన అవసరం నాకు లేదు. అందుకే పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు” అని తేల్చి చెప్పింది.అంటే ” ఇప్పుడు నేను చాలా హ్యపీగా జీవిస్తున్నాను, ఎవరి కోసం నా బిహేవియర్ ని మార్చుకోను అన్న మైండ్ సెట్ తో ఉందని క్లియర్ కట్ గా అర్థమైపోయింది.

స్వేచ్ఛే నా లైఫ్.. పెళ్లి కోసం రాజీ పడను!

అమీషా సమాధానం విన్న తర్వాత సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. కొందరు “ఇది కూడా ఒక లైఫ్ స్టైల్.. ఆమె ఇష్టం” అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం “పెళ్లి అనేది బంధం.. బరువు కాదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే అమీషా మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితి లేదని క్లియర్‌గా చెప్పేసింది.

హీరోయిన్ అయ్యాకే ప్రేమ కథకు బ్రేక్

Advertisement

అమీషా జీవితంలో ప్రేమ లేదనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె కూడా ప్రేమలో పడింది. కానీ హీరోయిన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మారిపోయింది.ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ప్రకారం… తన ప్రియుడికి హీరోయిన్‌గా కొనసాగడం అస్సలు నచ్చలేదట. సినిమాలు వదిలేయమని చెప్పడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి చివరికి బ్రేకప్ అయ్యిందట.అప్పుడే అమీషా ఒక విషయం బాగా అర్థం చేసుకుందట. “నా కలలను, నా కెరీర్‌ను గౌరవించని వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండలేను”అని నిర్ణయించుకుందట.

డేటింగ్ ఆఫర్లు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి!

51 ఏళ్లు వచ్చాయని అమీషా క్రేజ్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే. ఇప్పటికీ తనకంటే సగం వయసున్న అబ్బాయిలు కూడా డేటింగ్‌కు ప్రపోజ్ చేస్తున్నారని ఆమె స్వయంగా చెప్పింది.అయితే తనకు వయసు ముఖ్యం కాదని, మెచ్యూరిటీ, ఆలోచనా విధానం, పరస్పర గౌరవం ఉంటేనే రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తుందని చెప్పింది. అలాంటి వ్యక్తి ఇప్పటివరకు కనిపించలేదని కూడా చెప్పుకొచ్చింది.

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ ‘బద్రి’ హీరోయిన్‌గానే గుర్తు

తెలుగు వాళ్లకు అమీషా అంటే ముందుగా గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. “నువ్వు నందవైతే… నేను బద్రినిరా”అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో.. అమీషా క్యూట్ లుక్స్ కూడా అంతే వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘నాని’ సినిమాలోనూ తన అందంతో ఆకట్టుకుంది. తెలుగు సినిమాలు తక్కువ చేసినా.. ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఒక్క సినిమాతో స్టార్.. మరో సినిమాతో రీ-ఎంట్రీ

హిందీలో ‘కహో నా… ప్యార్ హై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమీషా.. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. అయితే కొంతకాలం కెరీర్ స్లో అయింది. అవకాశాలు తగ్గాయి. చాలా మంది ఆమె పని అయిపోయిందనుకున్నారు.

కానీ గతేడాది ‘గదర్ 2తో మరోసారి తన స్టామినా చూపించింది. సన్నీ డియోల్ సరసన సకీనా పాత్రలో నటించి ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది . ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.686 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా అమీషాకు గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి.

పెళ్లి కంటే ప్రశాంతమైన జీవితం ముఖ్యం!

మొత్తానికి కెరీర్ లో మళ్ళీ సినిమాలతో బిజీ అయిపోవాలని ఫిక్స్ అయిన అమీషా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచనల్లో లేనట్టే కనిపిస్తుంది.ఇప్పటి వరకు చాలామంది సెలబ్రిటీలు పెళ్లి గురించిడొంక తిరుగుడుగా మాట్లాడితే.. అమీషా మాత్రం ఎలాంటి ఫిల్టర్ లేకుండా తన మనసులోని మాట చెప్పేసింది. అందుకే ఆమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవైపు ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్న వాళ్లు ఉంటే.. మరోవైపు “ఎప్పటికైనా మనసు మారుతుందేమో” అని కామెంట్లు చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. కానీ అమీషా మాత్రం తన స్టాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.చూడాలి ముందు ముందు ఏమైనా మాట తప్పుతుందేమో !

also read :బ్లడ్‌బాత్‌తోనే పాన్ ఇండియా హీరో అవుతావా నాని ?

Tags

Related News

చిన్న డైలాగ్.. పెద్ద దుమారం.. ఇదే సోషల్ మీడియా మ్యాజిక్!

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్!

ప్రభాస్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ‘దందా’ దొర సాయి తేజ సినీ జర్నీ!

‘పళ్ళ బురుసు’ కోసం కోర్టుకెక్కిన పంచాయతీ.. ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న ట్రైలర్!

సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ఐకాన్ స్టార్ షాకింగ్ నిర్ణయం..?

హీరోయిన్ చాందినికి ఘోర అవమానం.. తల్లితోనే ఆ మాట అన్నారా?

రణ్‌బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!

Big Stories

Advertisement
×