E-Paper
Advertisement

కార్గిల్ వార్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ వరకు… ఒక్క ఓటీటీలోకి మూడు కొత్త సినిమాలు

కార్గిల్ వార్ నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ వరకు… ఒక్క ఓటీటీలోకి మూడు కొత్త సినిమాలు
Advertisement

Netflix OTT : ఆగస్టు మొదటి వీకెండ్ ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఒకేసారి మూడు విభిన్న జానర్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో సాగే మిలిటరీ డ్రామా నుంచి, ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, దేశ విభజన నేపథ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథ వరకు మూడు కొత్త సినిమాలు తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌లో ఉన్నాయి. ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా ? అయితే ఒకే ఓటీటీలో, పైగా తెలుగులో ఉన్న ఈ మూడు సినిమాలపై ఒక లుక్కేయండి.

1. ఆపరేషన్ సఫేద్ సాగర్ – వెబ్ సిరీస్

1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన చారిత్రాత్మక ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ ఆధారంగా తెరకెక్కిన హై-వోల్టేజ్ మిలిటరీ డ్రామా ఇది. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి మద్దతుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన వైమానిక దాడులు, యుద్ధ వ్యూహాలు, పైలట్ల ధైర్యసాహసాలను ఈ సిరీస్‌లో ఉత్కంఠభరితంగా చూపించారు. సిద్ధార్థ్, జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా కీలక పాత్రల్లో నటించారు. దేశభక్తి, యాక్షన్, ఎమోషన్ కలిసిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్‌తో సహా పలు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

2. ఇదయం మురళి – సినిమా

Advertisement

అథర్వ మురళి హీరోగా నటించిన ఈ కమింగ్-ఆఫ్-ఏజ్ రొమాంటిక్ డ్రామా కూడా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. న్యూయార్క్ నుంచి చెన్నైకి పెళ్లి కోసం వచ్చిన యువకుడు, ఎక్స్ లవర్ ఎదురు పడడంతో అతని జీవితంలో చోటుచేసుకునే భావోద్వేగ పరిణామాలే కథ. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, ఫహద్ ఫాజిల్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

3. మెయిన్ వాపస్ ఆవుంగా – సినిమా

ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ పీరియడ్ ఎమోషనల్ డ్రామా 1947 భారత విభజన నేపథ్యంలో సాగుతుంది. దశాబ్దాల తర్వాత తన గతాన్ని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ వృద్ధుడి ప్రయాణం, అతని జీవితంలో చెరిగిపోని ప్రేమకథ, విభజన వల్ల విడిపోయిన బంధాలను హృదయాన్ని తాకేలా చూపించారు. దిల్జీత్ దోసాంజ్, శార్వరి వాగ్, నసీరుద్దీన్ షా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించారు. భావోద్వేగ కథలు ఇష్టపడేవారిని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఒక్క ఓటీటీలోనే

Advertisement

ఈ మూడు సినిమాలు మూడు విభిన్న జానర్లలో తెరకెక్కాయి. యుద్ధ నేపథ్య కథలు ఇష్టపడేవారికి Operation Safed Sagar, ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ కోసం Idhayam Murali, భావోద్వేగాలతో కూడిన పీరియడ్ డ్రామా కోసం Main Vaapas Aaunga బెస్ట్ ఆప్షన్. ఈ మూడు కూడా ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ తప్ప మిగతా రెండూ తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి.

Read Also: నలుగురు మహిళల డార్క్ సీక్రెట్స్… బోల్డ్ తెలుగు ఆంథాలజీ థ్రిల్లర్ ఇప్పుడు 2 ఓటీటీల్లో

Tags

Related News

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Big Stories

Advertisement
×