Anupama parameswaran : ఒక మనిషిని ఇష్టపడి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన తర్వాత అతడి నిజస్వరూపం బయటపడితే.. ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి వెనకాడతారు. నిజంగా ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే.. నరకాన్ని సృష్టిస్తే ఇక ఆ భాగస్వామి ఎంతలా నరకం అనుభవిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, ఆ తర్వాత మోసం చేసి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) తన ప్రియుడు చేతిలో తాను అనుభవించిన నరకాన్ని అభిమానులతో పంచుకొని కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి మరో హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరో కాదు నీతి టేలర్ (niti taylor).
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన ప్రియుడు తనకు నరకం చూపించాడు అంటూ చేసిన కామెంట్లను బట్టి చూస్తే అనుపమ కూడా ఇలాంటి కామెంట్లు చేసింది కదా అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా నీతి టేలర్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నా మాజీ ప్రియుడు నన్ను చెంప దెబ్బ కొట్టి, తోసేసి సిగరెట్ల తో కాల్చాడు, ముఖ్యంగా నా మాజీ ప్రియుడు ఒక సైకోలా ప్రవర్తించేవాడు. నా స్నేహితులతో కలిసి నేను ఎక్కడికి వెళ్తున్నాననే విషయాలను తరచూ ఆరా తీసేవాడు. నేను చిన్న వయసులో ఉండడం వల్ల అతడు ఇలాంటివి ప్రశ్నించినప్పుడల్లా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసేదాన్ని.
ఒకరోజు నా మాజీ ప్రియుడు పుట్టినరోజు పార్టీకి వెళ్ళగా.. అక్కడ వాతావరణం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే నా మిత్రులతో కలిసి వెళ్లిపోవాలనుకున్నాను. అప్పుడు నా ప్రియుడు అడ్డుకున్నాడు.నా స్నేహితులు కార్లో వేచి ఉండగా.. నేను వెళ్ళిపోతున్నానని చెప్పడానికి నా ప్రియుడి దగ్గరికి వెళ్లాను. అతను వారితో నన్ను వెళ్ళనివ్వలేదు. కోపంతో ఊగిపోతూ నన్ను పక్కకు తోసేసి చెంపదెబ్బ కొట్టాడు. ఇక ఈ తతంగం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. చివరికి నా మిత్రులు జోక్యం చేసుకోవడంతో వాళ్లపై కూడా కోప్పడ్డాడు. అతను ఇంటిలో ఇలాంటివి సహజమేనని సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో ఒక్కసారిగా మేమంతా ఆశ్చర్యపోయాము.
also read: మూవీలో ఛాన్స్ ఇస్తా.. ఒక నైట్ పడుకోమన్నాడు.. నీతి టేలర్ సంచలన కామెంట్స్!
ఆ గొడవలో నేను ఉండలేక నా స్నేహితులతో కలిసి వెళ్లిపోదామనుకున్న సమయంలో మరింత కోపంగా అరిచాడు. ఆ సమయంలో అతడు సిగరెట్టు కాలుస్తూ మాట మాట పెరిగి నా శరీరం అంతా సిగరెట్ల తో కాల్చాడు. ఆ మచ్చలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది . మొత్తానికైతే నీతి గతంలో ఎవరితో డేటింగ్ చేసింది? ఎవరి కారణంగా ఆమె ఇంత టార్చర్ అనుభవించింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా మొన్న అనుపమ.. నేడు నీతి టేలర్ ప్రేమించిన వారి చేతిలో నరకం అనుభవించామని చెబుతుంటే అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&mdxt=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==