Emergency In Pakistan: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఫినిష్ కాగా మరోటి మిగిలి ఉంది. ఇవాళ సాయంత్రం మూడవ టి20 జరగనున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్లకు కొత్త టెన్షన్ మొదలైంది. ఈ మ్యాచ్ జరిగే రావాల్పిండి క్రికెట్ స్టేడియంపై ఉగ్రవాదులు అటాక్ చేసే ప్రమాదం పొంచి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
దీంతో నిన్నటి నుంచి స్టేడియం పరిసరాలలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది పాకిస్తాన్ సర్కార్. ఖైబర్-పఖ్తుంఖ్వాలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించిన తరుణంలోనే రావాల్పిండి స్టేడియం దగ్గర ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందని అంటున్నారు. ఈ తరుణంలోనే సెక్యూరిటీని పెంచినట్టు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు వణికిపోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు పాకిస్తాన్ పర్యటనకు ఎందుకు వచ్చామని తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు.
పాకిస్తాన్ వాయువ్య ప్రాంతం ఖైబర్-పఖ్తుంఖ్వాలో శాంతి భద్రతల సమస్య వచ్చింది. ఉగ్ర దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అక్కడి ఫెడరల్ సర్కార్ గవర్నర్ పాలనను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ క్షణమైన ఉగ్రదాడులు జరిగే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రకటన చేశారు. అయితే ఎమర్జెన్సీ పాలన విధించిన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా అలర్ట్ అయింది. అక్కడి రాజకీయ కారణాలవల్ల దేశవాళీ మ్యాచ్లను రీ షెడ్యూల్ చేశారు. ప్రెసిడెంట్ ట్రోఫీ గ్రేడ్ 1 టోర్నమెంటు వేదికలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లను షేక్ పురా, లాహోర్ ప్రాంతానికి తరలించారు.
ముందు జాగ్రత్తలో భాగంగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (SL VS PAK) టి20 సిరీస్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించింది PCB. ఇందులో భాగంగానే తమకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. అటు ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అలర్ట్ కావాలని తెలిపాయి. దీంతో రావాల్పిండి స్టేడియం దగ్గర హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గతంలోనూ లంక ప్లేయర్లపై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే పాకిస్తాన్ సర్కార్ మొద్దు నిద్రపోకుండా, రావాల్పిండి స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ప్లేయర్లకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటోంది. కాగా పాకిస్తాన్, లంక మధ్య మూడు 3 టీ20లు, రెండు టెస్టులు జరుగాల్సి ఉంది.