E-Paper
Advertisement

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?

గీతా గోవిందం, రంగస్థలం వదులుకున్న అనుపమ..కారణం?
Advertisement

Anupama parameswaran:టాలీవుడ్ హోమ్లీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ కల్యాణం’ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లలో జోరు పెంచిన అనుపమ (Anupama) , ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన కొన్ని భారీ చిత్రాలను తను ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్లాక్‌బస్టర్ సినిమాలకు మిస్సైన ఛాన్స్:

సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు, అందులోని పాత్రలు నటీనటుల కెరీర్‌నే మార్చేస్తాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’లో సమంత నటించిన ఐకానిక్ ‘రామలక్ష్మి’ పాత్ర కోసం మొదట తననే సంప్రదించారని అనుపమ వెల్లడించారు. ఫోటోషూట్ కూడా నిర్వహించారు. అయితే ఆ పాత్ర డి గ్లామరస్ గా ఉండడంతో నటించలేదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన అనుపమ అలాగే విజయ్ దేవరకొండ ‘గీతా గోవిందం’, తమిళ సూపర్ హిట్ ‘రాక్షసన్’ చిత్రాల్లోనూ కథానాయికగా అవకాశం వచ్చిందని చెప్పారు. అయితే ఆ సమయంలో వేరే సినిమాల షూటింగ్స్, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ ఆల్-టైమ్ హిట్ ప్రాజెక్టులను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

‘క్రేజీ కల్యాణం’తో దసరా సందడి:

Advertisement

బ్లాక్‌బస్టర్ అవకాశాలు చేజారినా, అనుపమ వరుస లీడ్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. దసరా బరిలో అక్టోబర్ 16న రాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ చిత్రంపై ఆమె భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక నేటి తరం పెళ్లిళ్ల కాన్సెప్ట్ ఆధారంగా డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు బద్రప్ప గాజుల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నరేష్ వీకే, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

పెళ్లి టాపిక్‌పై అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు:

ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై కూడా అనుపమ స్పందించారు. పెళ్లి అనేది ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. రాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారని అడగ్గా.. “వచ్చినప్పుడు చూద్దాం, నేను దాని గురించి ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు” అని నవ్వుతూ దాటవేశారు. ఇక వ్యక్తిగత విషయాల కంటే ప్రస్తుతం నటనపైనే తన పూర్తి దృష్టి ఉందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

also read:300 ఎకరాల్లో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్.. ఎక్కడంటే?

చేతిలో క్రేజీ ప్రాజెక్టులు:

ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే, మరోవైపు స్టార్ హీరోలతోనూ జతకడుతున్నారు అనుపమ. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘భోగి’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా గ్లింప్స్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుస సినిమాలతో అలరిస్తున్న అనుపమ కెరీర్ మున్ముందు మరిన్ని మలుపులు తిరగడం ఖాయం.

ఇక మొత్తానికి చూస్తే, కెరీర్ ప్రారంభంలో ‘రంగస్థలం’, ‘గీతా గోవిందం’ వంటి ఇండస్ట్రీ హిట్లను డేట్స్ కుదరక వదులుకున్నప్పటికీ.. అనుపమ తన స్వయంకృషితో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దసరా కానుకగా రాబోతున్న ‘క్రేజీ కల్యాణం’ సినిమాతో పాటు శర్వానంద్‌తో చేస్తున్న ‘భోగి’ చిత్రం ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో వేచి చూడాలి.

Related News

తెలుగు సినిమాల్లో దుమ్మురేపిన తెలంగాణ జానపద పాటలు ఇవే!

నాకు ఎలాంటి రోగం లేదు..తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దన్న కమెడియన్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. జటాయువు పాత్రలో స్టార్ సెలబ్రిటీ!

ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న రణబాలి..రన్ టైం ఎంతంటే?

300 ఎకరాల్లో ఫిలిం స్టూడియో నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్.. ఎక్కడంటే?

ప్రేమించిన వాడి చేతిలోనే నరకం.. మొన్న అనుపమ.. నేడు?

మూవీలో ఛాన్స్ ఇస్తా.. ఒక నైట్ పడుకోమన్నాడు.. నీతి టేలర్ సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×