BigTV English

Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ కాల్, పెళ్లి గురించి కూడా క్లారిటీ

Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ కాల్, పెళ్లి గురించి కూడా క్లారిటీ
Advertisement

Anushka Shetty: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు అనుష్క. చాలామంది సీనియర్ హీరోస్ తో పనిచేయడం మాత్రమే కాకుండా మహేష్ బాబు వంటి స్టార్ హీరోస్ తో కూడా సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా బాహుబలి సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది.


బాహుబలి సినిమా కంటే ముందు అనుష్కకి ఒక ఇమేజ్ ఉంది. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అనుష్క కెరియర్ గురించి ప్రస్తావన వస్తే అరుంధతి సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇక ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి అనే సినిమాను చేసింది అనుష్క. సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో దగ్గుపాటి రానాతో మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి గురించి క్లారిటీ


నేను ఇలా అడక్కూడదు కానీ వరుసగా సినిమాలు చేస్తావా లేకపోతే రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలుగా ఒకసారి సినిమా చేస్తావా.? అని రానా అడిగారు. డెఫినెట్ గా మంచి సినిమాలు ఎంచుకొని సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇకనుంచి రెస్ట్ లెస్ గా వర్క్ చేయాలి. వచ్చే ఏడాది ఎండింగ్ కి నన్ను ఇంకా ఎక్కువగా చూస్తారు. అందరూ అదే ప్రశ్న వేస్తున్నారు.

పెళ్లి ఏదైనా ఉన్నా కూడా అందరూ అదే అంటున్నారు అని అనుష్క అన్నారు. వెంటనే రానా ఏంటి నీకు పెళ్లి అనుష్క ను అడిగాడు. నా పెళ్లి కాదు ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగిన అందరూ ప్రశ్నిస్తున్నారు. నాది కాదు అని గట్టిగా చెప్పారు అనుష్క. మొత్తానికి ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆడియో విన్న చాలామంది చాలా రోజుల తర్వాత అనుష్క వాయిస్ వినడం చాలా హ్యాపీగా అనిపించింది అంటూ మాట్లాడుతున్నారు. ఇక ఫైనల్ గా రానా ఘాటి సినిమా ప్రీమియర్ లో అనుష్కను కలవనున్నారు.

అంచనాల ఘాటి 

ఇకపోతే మరోవైపు ఘాటీ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ట్రైలర్ చాలామందికి షాకింగ్ అనిపించింది. అనుష్క ఇంతకుముందు ఈ జోనర్ సినిమా చేసిన కూడా ఇప్పుడు మరింత వైలెంట్ గా సినిమాలో కనిపిస్తుంది. మొత్తానికి క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాతో గట్టిగానే ప్లాన్ చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత ఇప్పటివరకు క్రిష్ సక్సెస్ఫుల్ సినిమా చేయలేదు.

Also Read: Kishkindhapuri: వెనక్కు తగ్గిన బెల్లంకొండ, కంటెంట్ చూసి భయమా? సినిమా మీద గౌరవమా?

Related News

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Big Stories

×