Teja Sajja: తేజ సజ్జ(Teja Sajja) పరిచయం అవసరం లేని పేరు. బాల నటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన తేజ ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక హీరోగా నటించిన జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించిన హనుమాన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తేజ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నాయి.
కల్కి 2 లో తేజ సజ్జ..
ఇక త్వరలోనే ఈయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటించిన మిరాయ్(Mirai) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తేజ సజ్జకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తేజ ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమాలో అవకాశమందుకున్నారని సమాచారం. ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి(Kalki). ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు. ఇక త్వరలోనే కల్కి 2(Kalki 2) కూడా షూటింగ్ పనులను కూడా ప్రారంభం కాబోతున్నాయని తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) వెల్లడించారు.
అభిమన్యుడి పాత్రలో తేజ సజ్జ…
ఇదిలా ఉండగా కల్కి 2 సినిమాలో మరి కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తేజ సజ్జ కూడా ఛాన్స్ అందుకున్నారని సమాచారం ఈ సినిమాల్లో తేజ కల్కి పాత్రలో లేదా అభిమన్యుడి పాత్రలో నటించబోతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న కల్కి2 సినిమాలో తేజ ఛాన్స్ అందుకున్నారంటే ఇక ఈయన సినీ కెరీర్ కు తిరుగుండదని అభిమానులు భావిస్తున్నారు.
ధర్మాన్ని కాపాడే యోధుడిగా..
ఇక తేజ ఈ సినిమాలో భాగమైనట్టు వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తేజ మిరాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఈయన ధర్మాన్ని కాపాడే యోధుడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రీతికా నాయక్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఇక మంచు విష్ణు విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. జగపతి బాబు, శ్రియ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు
Also Read: Jayammu Nischayammuraa: సందీప్ ముందు ఆర్జీవీ పరువు తీసిన జగపతి… నా వోడ్కా ఎక్కడా అంటూ