BigTV English

Multani Mitti: ఇంట్లో ముల్తానీ మిట్టి ఉందా? అయితే మీ ముఖాన్ని ఆ పొడితోనే ఇలా మచ్చలు, మొటిమలు లేకుండా చూసుకోండి

Multani Mitti: ఇంట్లో ముల్తానీ మిట్టి ఉందా? అయితే మీ ముఖాన్ని ఆ పొడితోనే ఇలా మచ్చలు, మొటిమలు లేకుండా చూసుకోండి

ముల్తానీ మిట్టి అనేది ఖనిజాలతో కూడిన ఒక బంక మట్టి. దీన్నే పుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. దీనిలో నీటి శాతం కూడా అధికంగానే ఉంటుంది. అందుకే మన ముఖానికి తేమను అందిస్తుంది. ముఖాన్ని శుభ్రపరిచే లక్షణాలు దీనిలో ఎక్కువ. అంటే క్లెన్సర్ లక్షణాలు ముల్తానీ మిట్టిలో అధికంగా ఉంటాయి. మన చర్మంపై ఉన్న అదనపు నూనెను తగ్గించేందుకు ఇది సహాయపడుతుంది.


మొటిమలతో ఇబ్బంది పడుతున్న వారు ముఖ టోన్ ను పెంచుకోవాలనుకునే వారు ముల్తానీ మిట్టిని వారంలో రెండు మూడుసార్లు ఉపయోగించవచ్చు. ఇది మీకు ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రకాశవంతమైన, మొటిమలు లేని చర్మాన్ని మీకు అందిస్తుంది. ముల్తానీ మిట్టి ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలో తెలుసుకోండి.

ముల్తానీమిట్టి ఫేస్ మాస్క్
తాజాగా ప్రకాశవంతమైన చర్మాన్ని కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం మీరు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వందలు, వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా సులభమైన ఫేస్ ప్యాక్ ను వేసుకోండి. ఒక గిన్నెలో ఒక స్పూన్ ముల్తాన్ మిట్టి, అర స్పూన్ గంధపు పొడి వేసి బాగా కలపండి. అందులోనే పావు స్పూను పసుపు పొడి, ఒక స్పూన్ రోజ్ వాటర్, కొంచెం పాలు వేసి ఒక పేస్టులాగా తయారు చేయండి. దీన్ని ముఖంపై అప్లై చేయండి. అది పూర్తిగా ఆరిపోయే వరకు వేచి ఉండండి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ముఖానికి అందుతాయి.


మొటిమలు, మచ్చలు తగ్గేందుకు
అమ్మాయిల ముఖాలపై మొటిమలు, మచ్చలు వంటివి వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకుంటే చర్మం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు ఒక స్పూను ముల్తానీ మిట్టి వేసి అందులో వేప పొడిని వేసి బాగా కలుపుకోవాలి. నీరు లేదా రోజ్ వాటర్ వేయడం ద్వారా అది పేస్టులాగా అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించాలి. ఇందులో ఉండే లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ప్రభావాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి. ఎరుపు దనాన్ని, దురదను, చికాకును తగ్గిస్తాయి. మొటిమలను కూడా తగ్గిస్తాయి. ఇది చర్మానికి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి
జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టితో చర్మాన్ని పొడిగా మెరిసేలా చేసుకోవచ్చు. ముల్తానీ మిట్టి చర్మానికి రాయడం వల్ల అక్కడ ఉన్న అదనపు నూనె పీల్చుకుంటుంది. ఈ ఫేస్ మాస్క్ తయారీ కోసం ఒక స్పూను ముల్తానీ మిట్టి, పావు స్పూను పసుపు పొడి, ఒక స్పూను నిమ్మరసం, ఒక స్పూన్ తేనే తీసుకోవాలి. ఈ మూడు ఈ నాలుగు ఇంటిని కలిపి పేస్టులాగా చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయే వరకు అది ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మంపై రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మృదువుగా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

Related News

Mint leaves benefits: ఉదయాన్నే ఈ ట్రిక్ చేస్తేచాలు.. మీ రోగాలన్నీ బలాదూర్

Black pepper benefits: అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పొడితో జస్ట్ ఇలా ట్రై చేయండి

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Big Stories

×