Arjun sarja:కన్నడ నటుడిగా యాక్షన్ కింగ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అర్జున్ సర్జా. ఒకవైపు హీరోగా , మరొకవైపు దర్శకుడిగా పలు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా మారిన ఈయన మరొకవైపు తన వ్యక్తిగత బాధ్యతలను కూడా నెరవేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన పెద్ద కూతురు ఐశ్వర్య కి వివాహం జరిపించిన ఈయన, ఇప్పుడు తన చిన్న కూతురు అంజన వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 18వ తేదీన అంజన మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టనుంది. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అర్జున్ సర్జ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. దాదాపు 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న అంజనా సర్జ పెద్దలను ఒప్పించి తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యింది. అక్టోబర్ 18 వ తేదీన వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అంజన ప్రియుడు ఎవరు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ ఈయన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. చూడముచ్చటి జంట అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అంజన విషయానికి వస్తే.. ఈమె తన తండ్రి , తన సోదరీలాగా సినిమాలలోకి రాకుండా విభిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగానే ఈమె బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. 2023లో హ్యాండ్ బ్యాగుల తయారీ సంస్థను ప్రారంభించింది. ఇక్కడ తయారయ్యే హ్యాండ్ బ్యాగులన్నీ కూడా కేవలం పండ్ల తొక్కలు , కూరగాయల తొక్కలు, నార వంటి వాటితోనే తయారు చేస్తారు. పర్యావరణానికి అనుకూలంగా తయారు చేస్తున్న ఈ హ్యాండ్ బ్యాగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈమె బిజినెస్ లో రాణిస్తూనే ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యింది. మొత్తానికైతే అర్జున్ చిన్న కూతురు అంజన కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
also read:సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
ఇక అర్జున్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. 1988లో ప్రముఖ కన్నడ నటి నివేదితను ఈయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య , అంజనా అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. ఐశ్వర్య ఇప్పటికే విశాల్ సరసన హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలో , నిర్మాణంలో సొల్లివిడవా అదే చిత్రంలో కూడా నటించారు. ప్రస్తుతం ఈమె తన తండ్రి వ్యాపారం, నిర్మాణ సంస్థ పనులు చూసుకుంటున్నారు. ఇక యాక్షన్ హీరోగా ముద్ర వేసుకున్న అర్జున్ కేవలం కన్నడకే తన ప్రతిభ పరిమితం చేయకుండా.. తెలుగు, తమిళ్ వంటి భాషలలో కూడా సినిమాలు చేస్తూ.. నిర్మిస్తున్నారు కూడా.. ఏది ఏమైనా అర్జున్ కూతురు పెళ్లి జరగబోతోంది అని తెలియడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి వీరి వివాహ వేడుకలలో ఏ అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందో చూడాలి.