Aruna Janasena: తమిళ రచయిత వైరముత్తు (Vaira Mutthu) విషయంలో చిన్మయి ఏవిధంగా రియాక్ట్ అవుతుందో తెలియంది కాదు. అతని గురించి ఎవరైనా పాజిటివ్‌గా స్పందిస్తే అస్సలు తట్టుకోలేదు. దీనికి ఆమెకు ఉండే కారణాలు ఆమెకు ఉన్నాయనుకోండి. తాజాగా వైరముత్తు జ్ఞానపీఠ అవార్డు అందుకోవడంతో ఎంతోమంది తమిళ సినీ ,రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది చిన్మయి (Chinmayi)కి నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో వైరముత్తుకు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కూడా అభినందనలు తెలిపారు. అంతకు ముందు కమల్, రజినీ కూడా అభినందనలు తెలిపారు. వారిని విమర్శించినట్లుగానే, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై కూడా చిన్మయి ట్వీట్ పేల్చింది.
Also Read- Romantic Drama OTT : భార్య అందగత్తె… భర్త మాత్రం మరో మహిళతో… సినిమా ఉంటుంది మావా
సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలలోకి వెళ్లిన ఎంతో మంది నాయకులు అమ్మాయిల సమస్యలను పట్టించుకోరని, ఇలాంటి వారికి ఓట్లు వేసే సమయంలో మహిళలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ చిన్మయి సూచనలు చేస్తూ వస్తున్న చిన్మయి.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ.. ‘మహిళలను లైంగికంగా వేధించిన ఆ కవి గురించి బహుశా పవన్ కళ్యాణ్‌కు ఏమి తెలియకపోయి ఉండవచ్చు. ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకసలు అర్థం కాలేదు’ అంటూ రియాక్ట్ అయింది. దీంతో చిన్మయిపై మెగా ఫ్యాన్స్ కూడా అస్సలు తగ్గడం లేదు. ఆమె పెళ్లి అనంతరం భర్తతో కలిసి వైరముత్తు దంపతుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసి.. ‘మరి ఇదేంటి’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read- Raashi Khanna: ఫస్ట్ సినిమా చేసేటప్పుడే.. ఆ నిర్ణయం తీసుకున్నా! నా కల నిజమైంది
తాజాగా చిన్మయి విమర్శలపై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ (Arjun Janasena) ఎక్స్ వేదికగా ఆమెకు కౌంటరిచ్చారు. ‘‘డియర్ చిన్మయి.. నైపుణ్యం వేరు, వ్యక్తిత్వం వేరు. నైపుణ్యంలో కనబరిచే అత్యుత్తమ ప్రతిభకి ఇచ్చిన అవార్డుకి మా నాయకుడు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియపరిచారు. మీరు ఆరోపించిన విధంగా వ్యక్తిగత జీవితంలో అతి ఉత్తములుగా ఉండే వారికీ ఏవైనా అవార్డ్స్ ఉంటే తెలియపరచండి.. అవి వైరముత్తు గారికి రావు ఏమో, మీరు చెప్తున్నా మాటలు ప్రకారం విష్ చేయకుండా ఉంటారు. అలాగే ఎదుటి వారు ఎలాంటి వారు అయినా భగవంతుడికి విన్నవించేది ఎప్పుడు శుభముగానే ఉండాలి అనేది మానవత్వం. పాపపుణ్యాల లెక్కలు ఆయనవే. మనవి కాదు..’’ అంటూ మళ్లీ మాట్లాడకుండా అరుణ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం అరుణ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గౌరవ @Chinmayi గారు. నైపుణ్యం వేరు, వ్యక్తిత్వం వేరు.
నైపుణ్యం లో కనబరిచే అత్యుత్తమ ప్రతిభ కి ఇచ్చిన అవార్డు కి sri @PawanKalyan గారు అభినందనలు తెలియపరిచారు.
మీరు ఆరోపించిన విధం గా వ్యక్తిగత జీవితం లో అతి ఉత్తములుగా ఉండే వారికీ ఏవైనా అవార్డ్స్ ఉంటే తెలియపరచండి అవి వైరముత్తు… https://t.co/Zlim0JISyB— aruna janasena (@RayapatiAruna) March 16, 2026
Also Read- Pawan Kalyan: విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్నే ఎందుకు?