E-Paper
Advertisement

Pawan Kalyan: విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్నే ఎందుకు?

Pawan Kalyan: విజయ్ ‘జన నాయగన్’ సెన్సార్ ఇష్యూపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వాన్నే ఎందుకు?
Advertisement

Pawan Kalyan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) రిలీజ్‌కు నోచుకోకుండా, ఎన్ని కష్టాలను అనుభవిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉంది. నిర్మాణ సంస్థ కోర్టుల చుట్టూ తిరుగుతోంది. తాజాగా ఎన్నికల కమిషన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీని ఖరారు చేయడంతో.. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో, అసలు థియేటర్లలో విడుదల అవుతుందో, లేదో అనేలా పరిస్థితి మారిపోయింది. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్‌గా సినిమా విడుదల కాబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సరే ఈ విషయం ఇలా ఉంటే, ఈ సినిమా సెన్సార్ ఇబ్బందులపై టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read- Ustaad Bhagat Singh: తమిళంలో విడుదలకు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్..ఎప్పుడంటే?

‘ఓజీ’కి కూడా ఇలాగే జరిగింది

Advertisement

తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. సినిమా సెన్సార్ కాకపోతే.. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. ‘‘రాజకీయాలకు, సెన్సార్‌కు సంబంధం లేదు. నేను అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైనప్పటికీ, నా సినిమా ‘OG’కి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్‌నే జారిచేసింది. మీరు ప్రభుత్వంలో భాగమే కదా.. సెన్సార్ విషయంలో జోక్యం చేసుకోవచ్చు కదా.. అని దర్శకనిర్మాతలు అడిగారు. ‘ఓజీ’ సినిమాలో హింస ఎక్కువగా ఉన్నప్పుడు యుబైఏ సర్టిఫికేట్ ఎలా వస్తుందని నేనే వారిని ప్రశ్నించాను. చట్టం లేదా నిబంధనలు అనేవి అధికారంలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా మార్చబడవని చెప్పాను. పాలన వేరు, సినిమా సెన్సార్ బోర్డు వేరు. నిబంధనలు అందరికీ ఒక్కటే, అవి అధికారంలో ఉన్నారా లేదా అన్నదానిపై ఆధారపడి మారవు.

Also Read- Manchu Manoj: కొన్నిసార్లు చరిత్రను మార్చేది సైన్యాలు కావు.. మంచు మనోజ్ పోస్ట్ వైరల్

కోర్టుకు వెళ్లడం కరెక్ట్ కాదు

Advertisement

విజయ్ సినిమా ‘జన నాయగన్’ విషయంలో అనవసరంగా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.. సెన్సార్ బోర్డు తన నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. ‘జన నాయగన్’ చిత్ర నిర్మాతలు ఈ సమస్యను కోర్టు వరకు తీసుకెళ్లడం నా దృష్టిలో సరికాదని అనుకుంటున్నాను. సెన్సార్ బోర్డుతో వచ్చే చిన్న చిన్న సమస్యలను చర్చల ద్వారా లేదంటే బోర్డు సూచనల ప్రకారం సర్దుబాటు చేసుకోవాలే తప్ప, న్యాయస్థానాలను ఆశ్రయించడం కరెక్ట్ కాదు. గతంలో నా సినిమాల్లో కూడా పాటలోని లిరిక్స్ మార్చమని సెన్సార్ బోర్డు కోరితే, అందుకు అంగీకరించి మార్పులు చేశాం. ఇలాంటివి పరిశ్రమలో అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. ఒక్కసారి విషయం కోర్టు వరకు వెళ్ళిందంటే, దాని ఫలితం పూర్తిగా న్యాయ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మొత్తం వివాదంలో NDA ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ వారు కోర్టుకు వెళ్ళకుండా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది’’ అని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంది.

Also Read- Mythri Producers: ఆ వెలితి తీరిపోయింది.. ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారేంటి?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×