E-Paper

నమ్మించి ముంచేసిన భర్త.. క్యాన్సర్‌తో అద్దె ఇంట్లోనే కన్నుమూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

నమ్మించి ముంచేసిన భర్త.. క్యాన్సర్‌తో అద్దె ఇంట్లోనే కన్నుమూసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
Advertisement

Ashwini Story: సినీ రంగం ..ఇదొక రంగుల ప్రపంచం.ఇక్కడ కీర్తి ప్రతిష్టలు,కల్ట్ క్లాసిక్లు, కోట్ల రూపాయలే కాదు ..కటిక పేదరికం, అనాథలా జీవనం, ఒంటరి తనంతో ముగిసే జీవితం వంటివీ ఉంటాయి. వీటన్నింటికి ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇప్పటికే మన కళ్ళముందు ఉన్నాయి కూడా. అలాంటి ఒక విషాదకరమైన, గుండెల్ని పిండేసే నిజ జీవిత కథే అశ్వినిది.అశ్విని అంటే ఎవరు అనుకుంటున్నారా ..?వెంకటేష్ తొలి సినిమా కలియుగ పాండవులు సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది ఈ అమ్మాయే.

‘భక్త ధ్రువ’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి

అశ్విని  1967 July 4న నెల్లూరులో పుట్టింది .అసలు పేరు వాణి. చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్న అశ్వినికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేదట.కాని అనుకోకుండా ఆమె జీవితం సినిమాల వైపు నడించింది.అలా మొదటిసారిగా మహానటి భానుమతి నిర్మించిన ‘భక్త ధ్రువ’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టింది అశ్విని.ఇక ఆ తర్వాత సినిమాలకి కామా పెట్టి  చదువులో మునిగిపోయింది అలా ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక రోజు షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు  నిర్మాత వాకాడ అప్పారావు ఆమెని చూసి ఇండస్ట్రీ లో తీసుకొచ్చారు. అయితే ఆమె కోడి రామకృష్ణ సినిమాలో మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టాల్సి ఉండింది.కాని అనుకోని కారణాల మొదటి సినిమా అలా మిస్ అయినా ధవళ సత్యం  దర్శకత్వం వహించిన  గుడిగంటలు మోగాయి అనే సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆయనే వాణి అనే పేరుని అశ్విని అనే పేరుగా మార్చడం విశేషం.అయితే ఈ గుడిగంటలు మోగాయి సినిమా రిలీజ్ ఆలస్యం అవడంతో తమిళంలో వచ్చిన ‘ఆనంద కుమ్మి’ ఆమె అశ్విని తొలి సినిమాగా రిలీజ్ అయింది.

కలియుగ పాండవులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ లీగ్

Advertisement

అయితే అశ్వినికి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం  రెబల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా వచ్చిన  ‘భారతంలో శంఖారావం’.ఒక రకంగా అశ్వినిని ఇండస్ట్రీలో వేణు తిరిగి చూసుకోకుండా చేసిన సినిమా ఇదే అని చెప్పాలి.మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సినిమా ‘కలియుగ పాండవులు సినిమాతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి దూసుకొచ్చింది,ఇక ఆ తర్వాత ఆమె చేసిన ‘చూపులు కలిసిన శుభవేళ’, నట సింహం బాలయ్య తో చేసిన  ‘భలే తమ్ముడు’అశ్వినికి మంచి పేరే తెచ్చాయి.

also read:జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

Advertisement

అలా వరుసగా  కృష్ణ, శోభన్ బాబు, నాగార్జున, రాజశేఖర్ వంటి టాప్ హీరోల సినిమాల్లో చాన్స్ లు కొట్టేసిన అశ్విని  టాలీవుడ్, కాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో దాదాపు 100 నుండి 150 పైగా చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ మాంచి పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె పాలిట  శాపంగా మారింది. అదే మద్రాస్‌లో వీడియో స్టూడియో నడిపే రవీంద్రనాథన్ ని ప్రేమించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం.1991లో జరిగిన ఈ పెళ్లి ఆమె జీవితం లో చేసిన పెద్ద తప్పిదం అనే చెప్పాలి.చేసుకున్న భర్త చేతిలో దారుణంగా మోసపోయి సంపాదించిన ఆస్తులని డబ్బుని కోల్పోయింది.దాంతో మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిన అశ్విని మళ్ళీ సినిమాల్లో అంతగా అవకాశాలని దక్కించుకోలేకపోయింది.ఇక అశ్విని పిల్ల విషయానికి వస్తే కార్తీక్ అనే బాబును అశ్విని దత్తత తీసుకుందని కొందరు అంటే మరికొందరు ఆమెకు పుట్టిన సంతానమే కార్తీక్ అని అంటుంటారు.

అండగా నిలబడ్డ పార్తీబన్ 

ఇక ఒకవైపు ఒంటరి తనం,మరో వైపు ఫైనాన్సియల్ గా ఇబ్బందులు వెరసి కనీసం సీరియల్స్ తో నైనా నిలబడాలని ఆమె చేసిన ఫలించలేదు.ఇక ఇదే సమయంలో  ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్) ఎటాక్ చేయడంతో హసుపత్రి ఖర్చుల కోసం చెన్నైలో ఉన్న సొంతిల్లుని అమ్మేసి రెంట్ ఇంట్లోకి మారిపోయింది.ఒకప్పుడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న నటి చివరికి రోజు గడవడమే కష్టంగా మారిన స్థితికి వచ్చారు..అయితే ఈ సమయంలోనే  తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ కొడుకు రాధాకృష్ణన్, అశ్విని కొడుకు కార్తీక్ క్లాస్‌మేట్స్ కావడంతో వారి పేదరికం పార్థిబన్ దృష్టికి వెళ్లింది. ఆయన మంచి మనసుతో అశ్విని కుటుంబానికి డబ్బుల పరంగా సహాయం అందించారు. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ కాస్తా మరింత సీరియస్ అవడంతో  2012 సెప్టెంబర్ 24న అశ్విని కేవలం  45 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూసింది అశ్విని.చివరి రోజుల్లో తన అంత్యక్రియలు సొంతూరైన నెల్లూరులో జరగాలన్నది ఆమె చివరి కోరిక.కాని నెల్లూరు కి ఆమె డెడ్ బాడీ ని తీసుకుపోవడానికి ఫ్యామిలీ వద్ద డబ్బులు లేకపోవడంతో పార్తీబన్ తన స్వంత ఖర్చులతో అంత్య క్రియలు చేసి ఆమె కొడుకు బాధ్యతని కూడా తన బాధ్యతగా స్వీకరించడం విశేషం.

ఏది ఏమైనా వరుస సక్సెస్ లతో ఇండస్టీలో స్టార్ డమ్ చూసిన అశ్విని చివరి రోజుల్లో అనమకురాలిగా చావడం ఏంటో బాధాకరం . ఇపుడు వచ్చే హీరోయిన్లకైనా ఈమె జీవితం కనువిప్పు కావాలని కోరుకుందాం !

Related News

సుకుమార్-డీఎస్పీ 20 ఏళ్ల బంధానికి బ్రేక్? RC17 నుండి రాక్‌స్టార్ అవుట్..?

జన సైనికులా? గూండాలా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మండిపడ్డ ప్రకాష్ రాజ్!

చిరంజీవి బర్త్డే స్పెషల్.. మెగా 158 పై తమన్ అదిరిపోయే అప్డేట్!

జానపదాల జాతర నుంచి టాలీవుడ్ హీరోయిన్ గా.. ఎవరీ నాగదుర్గ?

విరాజ్ అశ్విన్ ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ పై అంచనాలు పెంచేసిన బన్నీ.. స్పెషల్ పోస్ట్ వైరల్!

72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్.. రంగంలోకి సౌత్ స్టార్ హీరోలు!

మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన అమీర్ ఖాన్!

Big Stories

×