12 Years Of Atlee : బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా సక్సెస్ సాధించటం అనేది మామూలు విషయం కాదు. అయితే అన్ని సినిమాలు కూడా సక్సెస్ అయ్యేలా తీయడం అనేది ఒక ప్రత్యేకమైన టాలెంట్. ఈ టాలెంట్ గురించి మాట్లాడితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెంటనే గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్ రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాజమౌళి ఎలానో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి అట్లీ అలా అని కూడా చెప్పొచ్చు. రాజా రాణి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అట్లీ. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ సాధించింది. వెంటనే వరుస అవకాశాలు అట్లీకి రావడం లభించాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని 100% సక్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు అట్లీ.
రాజా రాణి సినిమా విడుదలై నేటికి 12 సంవత్సరాలు దాటింది. ఈ 12 సంవత్సరాల్లో దర్శకుడుగా అట్లీ చాలా అచీవ్ చేశారు ఒక దానిని మించిన సినిమా మరొకటి చేశారు. ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ చేసిన సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి ఏ తమిళ దర్శకుడు ఇప్పటివరకు వేయికోట్ల సినిమా చేయలేకపోయారు. కానీ తమిళ దర్శకుడు అయిన అట్లీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. 1000 కోట్లు అచీవ్ చేసిన మొదటి దర్శకుడిగా అట్లీకి మంచి పేరు వచ్చింది.
జవాన్ సినిమాతోనే అట్లీకి పానుండే స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పుడు ఏకంగా తెలుగులో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 800 కోట్లతో నిర్మితం అవుతుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
రాజా రాణి సినిమా కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆ సినిమాలో అట్లీ ప్రేమను చూపించిన విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రేమ ఉంటుంది, జాయ్ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. అన్నిటినీ మించి ఒక ప్రేమలో ఫెయిల్ అయిపోతే ఎలా బయటపడొచ్చు అని ఒక హీలింగ్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు అట్లీ. ప్రస్తుతం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు కానీ ఒరిజినల్ అట్లీ ఫ్యాన్స్ రాజా రాణి ఇలాంటి లవ్ స్టోరీ ఇష్టపడతారు.