Vishal: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విశాల్ (Vishal) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈయన తెలుగు నటుడే అయినా కోలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు అక్కడి సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ.. మార్కెట్ బాగానే పెంచుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఎఫైర్ రూమర్స్ పై ఒక్క మాటతో క్లారిటీ..
దీనికి తోడు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నారు. మొదట వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) ను వివాహం చేసుకోవాలనుకున్న విశాల్.. హీరో శరత్ కుమార్ కారణంగానే ఇద్దరు విడిపోయారని సమాచారం. ఆ తర్వాత లక్ష్మీ మీనన్ (Lakshmi Menon), అభినయ (Abhinaya), అనీషా రెడ్డి (Aneesha Reddy), రీమాసేన్(Reemasen )ఇలా చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటికీ స్వయంగా విశాల్ పలుమార్లు స్పందించి, చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవన్నీ గాలి వార్తలే అంటూ హీరోయిన్ సాయి ధన్సిక (Sai Dhansika) ద్వారా క్లారిటీ ఇచ్చారు విశాల్.
ఆగస్ట్ 29న గుడ్ న్యూస్..
ఇకపోతే గత కొంతకాలంగా ప్రముఖ తమిళ నటి సాయి ధన్సికతో రిలేషన్ లో ఉన్నట్లు విశాల్ కన్ఫామ్ చేశారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరి పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ..”తొమ్మిదేళ్లుగా నడిగర్ సంఘం భవనం కోసమే పెళ్లి చేసుకోలేదు. ఈ భవనం పూర్తయిన వెంటనే అందులోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఇక ఈ భవనంలో జరిగే తొలి పెళ్లి కూడా నాదే. ఇప్పటికే బుకింగ్ కూడా చేసుకున్నాను. అందులో భాగంగానే ఆగస్ట్ 29వ తేదీన మీ అందరికీ గుడ్ న్యూస్ చెబుతాను అంటూ విశాల్ తెలిపారు. ఇక దీన్ని బట్టి చూస్తే విశాల్ ఆగస్ట్ 29న తన పెళ్లికి కొత్త ముహూర్తం ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్ల ఎదురీతకు విశాల్ ఒక్క మాటతో క్లారిటీ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు.
హీరో గానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్..
ఇకపోతే హీరో విశాల్ ఒకవైపు నటుడిగా పలు చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా కూడా భారీ సక్సెస్ అందుకున్నారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో ప్రముఖ హీరో ఆర్య (Arya) తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే స్టంట్ మాస్టర్ రాజు కూడా మరణించగా.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ALSO READ:Rahul Sipligunj: బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ సిప్లిగంజ్.. ఏకంగా కోటి రూపాయలు నజరానా!