AVS Uncle:ఏవీఎస్ (AVS) ….పరిచయం అక్కరలేని పేరు.తనదైన కామెడీతో ఎంతో మందిని అలరించిన ఈయన రైటర్ కమ్ డైరెక్టర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన సినిమా తరుణ్ హీరోగా నటించిన అంకుల్.
అయితే ఈ సినిమా రిలీజ్ అయి అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.ఇక ఇదే సినిమా విషయంలో తరుణ్ కి ఏవీయస్ కి మధ్య చెడిందన్న టాక్ కూడా అప్పట్లో ఫిలిం సర్కిల్స్ లో జోరుగా నడిచింది.అయితే అసలు ఆ సినిమా సమయంలో ఏంజరిగిందో చెప్పుకొచ్చారు ఏవీఎస్ (AVS) కూతురు శాంతి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈవిడ తరుణ్‌తో తన తండ్రికి ఉన్న అనుబంధం, సినిమా విషయంలో జరిగిన కొన్ని విషయాలు, బాలు కుటుంబంతో ఉన్న పరిచయం గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
వారంలోనే తట్టా బుట్టా సర్దేసిన అంకుల్
విషయానికి వస్తే తరుణ్ కెరీర్‌లో ‘నువ్వే కావాలి’ ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు.ఇక ఈ సినిమా తర్వాత తరుణ్ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. దీంతో ఆ తర్వాత వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయన్న సంగతి తెల్సిందే. అలా ఏవీఎస్ దర్శకత్వంలో ‘అంకుల్’ సినిమా పై ఎక్కడ లేని బజ్ వచ్చేసింది.కానీ సినిమా వారంలోనే తట్టా బుట్టా సర్దేయడంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తరుణ్ భారీ అట్టర్ ఫ్లాపుని మూట గట్టుకునే పరిస్థితి.
పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ
అయితే ఈ సినిమా గురించి శాంతి మాట్లాడుతూ భారీ హిట్ అందుకున్న హీరో తరుణ్ పేరును ఉపయోగించుకుని సినిమాకు మరింత పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తన తండ్రి అలా చేయలేదని చెప్పుకొచ్చింది.నువ్వే కావాలి సినిమా తర్వాత రిలీజ్ అయినప్పటికీ నువ్వే కావాలి తో పాటే ఈ సినిమా కూడా మొదలు పెట్టారని తెలిపింది.అయితే సినిమా పేరు అంకుల్ అవడం, అప్పటికే నువ్వే కావాలి రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ అవ్వడం మూలానా ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయని ,కానీ వాటిని సినిమా అందుకోలేకపోయిందని తెలిపింది.
డిసప్పాయింట్ అయిన తరుణ్ ప్యామిలీ
అయితే ఏవీయస్ ఒకసారి నమ్మితే ఇక మళ్ళీ ఆలోచించడని.ఎన్నో ఏళ్లుగా కథని రాసి .తనకి సంతృప్తి చెందిన తర్వాతే సినిమా తీయడానికి సిద్దపడ్డాడని తెలిపింది.అయితే నువ్వే కావాలి హిట్ తర్వాత సినిమా డిసప్పాయింట్ చేయడంతో తరుణ్ ఫ్యామిలీ డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమేనని,అయితే అందులో వాళ్ళని కూడా ఏమీ తప్పు పట్టడానికి ఏమీ లేదని ఎవరైనా వరుసగా సక్సెస్ లు చూడాలని కోరుకుంటారని చెప్పుకొచ్చింది.అయితే అంకుల్ సినిమా కన్నా ఓరి నీ ప్రేమ బంగారం కాను అనే సినిమాతోనే ఎక్కువగా నష్టాలని చూశామని, ఆ సినిమాకి చేసిన అప్పులు ఎన్నో ఏళ్ల పాటు కట్టాల్సి వచ్చిందని వాపోయింది శాంతి.
సింగర్ బాలు తో అనుబంధం
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఏవీఎస్ కుటుంబానికి, సినిమా పరిశ్రమలోని ప్రముఖులతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. సింగర్ బాలు తో తమ కుటుంబానికి మంచి పరిచయం ఉందని తెలిపింది.ఎవరైనా స్టార్ స్టేటస్ వస్తే లెవెల్ చూపిస్తారని కానీ బాలు చాలా సింపుల్ గా ఉండేవారని తెలిపింది ఏవీఎస్ పేరు వినగానే చాలామందికి ‘మాయలోడు’, ‘శుభలగ్నం’, ‘ఆ నలుగురు’ సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ‘ఆ నలుగురు’లో ఆయన పోషించిన పాత్ర మంచి పేరు తెచ్చింది.
తరుణ్ విషయానికి వస్తే
మరోవైపు తరుణ్ విషయానికి వస్తే ‘నువ్వే కావాలి’, ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఎలా చెప్పను’, ‘సోగ్గాడు’ వంటి సినిమాలతో ఆయన తనదైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ సక్సెస్ స్ట్రీక్ ని తర్వాతి రోజుల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. మొత్తానికి ఏవీఎస్ మనకి దూరం అయినప్పటికీ కుమార్తె శాంతి చెప్పిన పాత జ్ఞాపకాలు మరోసారి ‘అంకుల్’ సినిమాను, ఆ కాలం నాటి తరుణ్ కెరీర్‌ను, ఏవీఎస్ సినిమా జర్నీని మరోసారి కళ్ళముందుకు తీసుకువస్తున్నాయి.
also read :13 ఏళ్ల ప్రేమకు బ్రేక్.. విడిపోతున్న స్టార్ కపుల్..?