Vinu Mohan Divorce Rumours:సినిమా ఇండస్ట్రీ…ఇక్కడ పెళ్లి చేసుకోవడం ఎంత కామనో ,విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్. ఇక ఇదే ఇండస్ట్రీలో కలిసి పని చేసే వారు మాకూ మాకూ పడట్లేదు అంటూ విడాకుల బాట పట్టిన వారు కోకొల్లలు.ఇదిగో ఇపుడు అదే బాటలో మలయాళ నటుడు విను మోహన్, నటి విద్య కూడా నడుస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం కేవలం మళయాళ మీడియాలోనే కాకుండా నేషనల్ వైడ్ గా స్ప్రెడ్ అవుతుండటంతో వచ్చిన వార్తలు నిజమే కాబోలు అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.
2013లో పెళ్లి చేసుకున్న జోడీ
విను మోహన్, విద్య విషయానికి వస్తే వీరిద్దరూ ప్రేమించుకుని 2013లో పెళ్లి చేసుకున్నారు. అంటే ఇప్పటికి వీరి పెళ్లై దాదాపు 13 ఏళ్లు అవుతోందన్న మాట. అయితే ఇపుడు వీరిద్దరూ విడాకుల బాటలో నడుస్తున్నారని వార్తలు రావడానికి కారణం షల్ మీడియా నుంచే. విను మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భార్య విద్యతో కలిసి దిగిన ఫొటోలని డిలీట్ చేయడమే.ఎప్పుడు ఏ అకేషన్ జరిగినా వాటి విశేషాలని ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకునే విను ఉన్నపళంగా పెట్టిన ఫోటోలు డిలీట్ చేయడంతో ఒక్కసారిగా అభిమానుల్లో అనుమానాలు మొదలైపోయాయి.
భార్య విద్యతో దిగిన ఫోటోలు డిలీట్
అయితే మీడియా మొత్తం వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోడై కూసినప్పటికీ విను మోహన్, విద్యలు ఎక్కడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవ్వడం గమనార్హం,మరి అనుకోకుండా విను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భార్య విద్యతో దిగిన ఫోటోలు డిలీట్ చేశారా లేక బంధం బీటలు వారడంతో నిజంగానే విద్యతో తెగదెంపులు చేసుకుంటున్నాడా అన్నది మీడియా ముందుకు వచ్చి చెబితే కాని తెలిసేలా లేదు.
కెరీర్ విషయానికి వస్తే
విను మోహన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. మలయాళ సినిమాల్లో ఎంతో కాలంగా నటిస్తున్న విను తొలి సినిమా ‘నివేద్యం’.2007లో వచ్చిన ఈ సినిమాతోనే హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విను.ఇక ఆ తర్వాత ‘సైకిల్’, ‘చట్టంబినాడు’ వంటి సినిమాలతో సత్తా చాటిన విను మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన ‘జోమోంటే సువిశేషంగల్’ సినిమాలో కూడా నటించిన విను మోహన్ హీరోగా మాత్రమే కాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లోనూ తనదైన ముద్ర వేశారు.
వీరిద్దరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో !
ఇక విను భార్య విద్య కూడా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘నీలాంబరి’, ‘చెరియా కల్లనుమ్ వళియా పోలీసుమ్’, ‘మహారాజా టాకీస్’ వంటి సినిమాలతో సత్తా చాటిన విద్య సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్‌లో కూడా పనిచేయడం విశేషం.
also read :డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలతకు షాక్..రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు!
చూడాలి మరి పదమూడేళ్ళ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నారంటూ మీడియాలో హైలెట్ అవుతున్న వార్తలపై వీరిద్దరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో !