E-Paper
Advertisement

కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల.. BRS ఫైల్స్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్!

కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల.. BRS ఫైల్స్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్!
Advertisement

Kiran Reddy: కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏదో జరుగుతున్నట్లు బిఆర్ఎస్ పార్టీ నేతలను ఆరు బృందాలుగా పవర్ స్టేషన్ల వద్దకు పంపుతున్నారని అన్నారు. కేసీఆర్ విద్యుత్ ఛార్జీల కోసం పోరాటం చేశారని కేటీఆర్ అబద్దాలు చెప్తున్నారని, 2,000 సంవత్సరంలో బషీర్ బాగ్ కాల్పులు జరిగినప్పుడు కేసీఆర్ టీడీపీలోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ 2001లో టీడీపీ నుంచి బయటకు వచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారని కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చారని అన్నారు.

కేసీఆర్ పిట్ట కథలు..

కేటీఆర్ ముందు చరిత్ర తెలుసుకో అంటూ చామల ఫైర్ అయ్యారు. రైతులకు ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీది. బిఆర్ఎస్ హయాంలో డిస్కంలలో 81 వేల కోట్ల అప్పులు చేశారని అన్నారు. ఛత్తీస్ ఘడ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కేసీఆర్ పిట్ట కథలు చెప్పడం బంద్ చేయాలని ఎద్దేవా వేశారు. చత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి. ఇతర రాష్ట్రాల్లో తక్కువకే విద్యుత్ లభించే అవకాశం ఉన్నా చత్తీస్ ఘడ్‌తో ఒప్పందం చేసుకున్నారని అన్నారు.

జగదీష్ రెడ్డికి ఫామ్ హౌస్‌లు ఎక్కడివి..?

Advertisement

భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి వెయ్యి కోట్లు నష్టం కలిగించారని, యాదాద్రిని ఓపెన్ బిడ్డింగ్ పెట్టకుండా నామినేషన్ పద్ధతిలో బి.హెచ్.ఈ.ఎల్ కు ఇచ్చి కమీషన్లు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. మాజీ విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డికి ఫామ్ హౌస్‌లు ఎక్కడివి, ఎల్ నినో పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని అన్నారు. రైతులకు మేలు జరగాలని బిఆర్ఎస్ కోరుకోవాలని అన్నారు. రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారు. విపత్తులో రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బిఆర్ఎస్ ఆలోచన చేస్తోందని ఫైర్ అయ్యారు.

Also read: మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

డైవర్ట్ చేయాలని..

Advertisement

రైతులు ఎక్కువగా వరి పంటపై కాకుండా ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ప్రాజెక్టుల పేరుతో ఏ ప్రాజెక్టుల వద్ద ఎంత అవినీతికి పాల్పడ్డారో మా వద్ద లెక్క ఉందని అన్నారు. నామినేషన్ పద్దతిలో పవర్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు పొందారని అన్నారు. నిరంతరం రైతులకు ప్రజలకు కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, ఫామ్ హౌస్ బాగోతాలను డైవర్ట్ చేయాలని బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఫైర్ అయ్యారు.

బిఆర్ఎస్ నేతల ఫైల్స్..

తమకు ఓట్లు వేయలేదని ప్రజలు, రైతులపై బిఆర్ఎస్ కక్ష పెట్టుకుంది. ఎల్ నినోతో వచ్చిన కరువును కాంగ్రెస్ పై నెపం నెట్టాలని బిఆర్ఎస్ చూస్తోందని అన్నారు. బిఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టి పంటకు వేయించి రైతులు ఆగం కావాలని భావిస్తోందని అన్నారు. బిఆర్ఎస్ ను రైతులు, ప్రజలు క్షమించరని అన్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నేతల ఫైల్స్ ను ఒక్కొక్కటి బయట పెడతాము మిగులు రాష్ట్రాన్ని 10 ఏళ్ళల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల మయం చేసిందని అన్నారు.

Also read: 16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. నాని వైఫ్ అంజనా పోస్ట్ వైరల్!

Tags

Related News

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

టీజీఈజేఏసీ ఉద్యోగుల డిమాండ్లపై తేలని పంచాయితీ.. రెండు డీఏలపై సర్కార్ క్లారిటీ!

Big Stories

Advertisement
×