Babu Mohan Emotional Words About Kota Srinivasa Rao: దిగ్గజ నటుడు కోట శ్రీనివాస్ మృతిని ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు, గోప్ప నుటుడని టాలీవుడ్ కోల్పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్నేహాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ లు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.
కోట, బాబు బాండింగ్ ప్రత్యేకం..
వీరి కాంబినేషన్ వచ్చిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించాయి. వెండితెరపై వీరి కాంబోకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. సినీ కెరీర్ లో వీరిద్దరు కలిసి ప్రయాణించారు. కోట శ్రీనివాసరావు పేరు వినగాన్నే వెంటనే గుర్తోచ్చే పేరు బాబు మోహన్. అంతగా వెండితెరపై వీరిద్దరి కాంబో ఆకట్టుకుంది. రియల్ లైఫ్ లోనూ వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. వీరిద్దరు కలిసి ఎన్నో ఇంటర్య్వూలు కూడా ఇచ్చారు. తరచూ వీరు ఒకరిపై ఒకరు అభిమానాన్ని చాటుకుంటారు. కోట మరణంపై బాబు మోహన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ఆయనలాంటి చావు కావాలి
‘కోట నన్ను ఎంతో బాగా పలకరించేవారు. ఆయన అంత ఇబ్బందుల్లో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండ చనిపోయారు. కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. భరించారు. అలా పడుకున్నారు. నిద్రలోనే చనిపోయారు. అలాంటి మరణం అందరికి రాదు. ఆయనలాంటి మరణం నాకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను. కోట అన్నకు చెబుతుంటా. అన్న నీలాంటి మరణమే నాకు ఇవ్వమని ఆ దేవుడికి చెప్పు అని అనుకుంటాను’ అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
సెట్లో అన్నం తినిపించేవారు
ఆయన నాకు ప్రేమగా అన్నం తినిపించేవారు. సినిమా సెట్ ఏరా అన్నం తిన్నావా.. రా తిందాం అంటూ పలిచి ముద్దలు కలిపి పెట్టేవారు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కోట శ్రీనివాస రావు 1978లో చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రిగా, తాతగా, మామగా, బాబాయ్‌గా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తూ ప్రేక్షకుల మనసులో నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ , నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. తన 40 ఏళ్ల సినీ కెరీర్ లో 750 పైగా నటించిన ఆయన ఎన్నో హిట్, సూపర్ హిట్ చిత్రాలను అందించారు.