BigTV English

OTT Movie : కల్లోకి వెళ్లి కార్పొరేట్ సీక్రెట్స్ దొంగిలించే స్కామర్స్… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : కల్లోకి వెళ్లి కార్పొరేట్ సీక్రెట్స్ దొంగిలించే స్కామర్స్… మైండ్ బెండయ్యే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఈరోజు మన మూవీ సజెషన్ ఒక ఆస్కార్ విన్నింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. మైండ్ బెండ్ చేసే సై-ఫై మాత్రమే కాదు ఇదొక హీస్ట్ థ్రిల్లర్ కూడా. మరి ఇలాంటి అరుదైన కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘Inception. 2010లో విడుదలైన ‘ఇన్‌సెప్షన్’ ఒక మనసును కదిలించే సైన్స్-ఫిక్షన్ హైస్ట్ థ్రిల్లర్. ఒక దొంగ తన బృందంతో కలిసి ఒక వ్యక్తి మనస్సులో రహస్యాన్ని చొప్పించే అసాధ్యమైన మిషన్‌ను చేపడతాడు. ఈ చిత్రం ఆకర్షణీయమైన కథాంశం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, లియోనార్డో డికాప్రియో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కథ పరంగా ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది.

వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ విడుదలైన ఈ చిత్రంలో లియోనార్డో డికాప్రియో (డామ్ కాబ్), జోసెఫ్ గోర్డాన్-లెవిట్ (ఆర్థర్), ఎలియట్ పేజ్ (అరియాడ్నే), టామ్ హార్డీ (ఈమ్స్), కెన్ వాటనాబే (సైటో), డిలీప్ రావ్ (యూసఫ్), సిలియన్ మర్ఫీ (రాబర్ట్ ఫిషర్), టామ్ బెరెంజర్, మారియన్ కొటిలార్డ్ (మాల్) నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో సినిమా (Jio Cinema)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. తెలుగులోనే ఈ మూవీని చూడొచ్చు.


కథలోకి వెళ్తే…
ఇన్‌సెప్షన్ కథ డామ్ కాబ్ (లియోనార్డో డికాప్రియో) చుట్టూ తిరుగుతుంది. అతను కలల్ని దొంగిలించే నైపుణ్యం కలిగిన దొంగ. డ్రీమ్-షేరింగ్ టెక్నాలజీ ద్వారా కలలలోకి చొరబడి రహస్యాలను దొంగిలించగల సామర్థ్యం కలిగినవాడు. అతను తన భార్య మాల్ (మారియన్ కొటిలార్డ్) గత ట్రాజెడీ నుండి బయటపడలేక, తన కొడుకు, కూతురితో సాధారణ జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాడు.

ఇక సైటో (కెన్ వాటనాబే) ఒక శక్తివంతమైన బిజినెస్‌మ్యాన్. కాబ్‌కు ఒక అసాధ్యమైన మిషన్‌ను పూర్తి చేయమని ఆదేశిస్తాడు: రాబర్ట్ ఫిషర్ (సిలియన్ మర్ఫీ) అనే వ్యాపార వారసుడి మనస్సులో ఒక ఆలోచనను “ఇన్‌సెప్ట్” చేయడం, అంటే అతని సబ్‌కాన్షియస్‌లో ఒక ఆలోచనను నాటడం అన్నమాట. దీనివల్ల అతను తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని తనకు తెలియకుండానే నాశనం చేస్తాడు. ఈ మిషన్ విజయవంతమైతే, సైటో కాబ్‌ నేర చరిత్రను పూర్తిగా తుడిచేస్తానని వాగ్దానం చేస్తాడు.

Read Also : 16 ఏళ్ల అమ్మాయిల్ని మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ఎందుకో తెలిస్తే దిమాక్ కరాబ్

ఇదిలా ఉండగా, మిషన్ ను పూర్తి చేయడానికి కాబ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆర్థర్ (జోసెఫ్ గోర్డాన్-లెవిట్) అనే సన్నిహితుడు, అరియాడ్నే (ఎలియట్ పేజ్) అనే ఆర్కిటెక్ట్, ఆమె కలల ప్రపంచాలను డిజైన్ చేస్తుంది. ఈమ్స్ (టామ్ హార్డీ) అనే ఫోర్జర్, అతను కలలలో ఇతరుల గుర్తింపులను మార్చగలడు. యూసఫ్ (డిలీప్ రావ్) అనే కెమిస్ట్, అతను బలమైన సెడేటివ్‌లను సృష్టిస్తాడు. వీళ్ళతో కలిసి హీరో ఈ మిషన్ కోసం పని చేస్తాడు. అసలు ఆ మిషన్ సాధ్యమయ్యే పనేనా? హీరో అండ్ టీం ఈ పనిని సక్సెస్ ఫుల్ గా కానిచ్చారా? అవతలి వాడి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలితే విలన్ కు ఏంటి లాభం? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

OTT Movie : సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందా? ఒక్కో సీన్ కు మైండ్ బ్లాక్

OTT Movie : కిటికీలోంచి చూడకూడని సీన్ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకునే కుర్రాడు… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చిన అమ్మాయితో రెచ్చిపోయే ఓనర్… అర్ధరాత్రి వింత శబ్దాలు… వణుకు పుట్టించే సైకో సీన్స్

OTT Movie : మగాళ్లను దారుణంగా చంపే లేడీ కిల్లర్… 20 ఏళ్ల తరువాత అచ్చం అదే రీతిలో హత్యలు… కిర్రాక్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పనమ్మాయితో యజమాని రాసలీలలు… భర్త ఉండగానే సీక్రెట్ రొమాన్స్… క్లైమాక్స్ లో బుర్రపాడు ట్విస్ట్

OTT Movie : 7 రోజులు ఏకాంతంగా… బిజినెస్ మ్యాన్ తో 20 ఏళ్ల అమ్మాయి బిగ్ డీల్… నెవర్ బిఫోర్ ఏరోటిక్ థ్రిల్లర్ మావా

Big Stories

×