BigTV English

Finland Clever Trick: దారి పొడవునా.. చెట్లను గాల్లోకి వేలాడదీసి.. రష్యాకు చుక్కలు చూపించిన ఫిన్‌ల్యాండ్, ఎందుకలా?

Finland Clever Trick: దారి పొడవునా.. చెట్లను గాల్లోకి వేలాడదీసి.. రష్యాకు చుక్కలు చూపించిన ఫిన్‌ల్యాండ్, ఎందుకలా?

బలం, బలగం ఎక్కువ ఉండేవారే యుద్ధంలో గెలుస్తారా..? అన్నిసార్లూ అది కుదరదేమో. ఎందుకంటే యుద్ధంలో గెలవాలంటే బలంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలి. అవతలి వ్యక్తిని బురిడీ కొట్టించే ప్లాన్ ఉంటే విజయం వారి సొంతం అవుతుంది. సరిగ్గా అలాంటి వ్యూహంతోనే తనకంటే పెద్ద దేశాన్ని, పెద్ద సైన్యం ఉన్న దేశాన్ని, పెద్ద ఆయుధ సామగ్రి ఉన్న దేశాన్ని మట్టికరిపించింది ఫిన్లాండ్. 1941లో జరిగిన యుద్ధంలో రష్యా సైనికులకు చుక్కలు చూపెట్టింది. అయితే ఇందుకు వారు ఎంచుకున్న వ్యూహం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలిలాంటి ఐడియాలు వారికి ఎలా వచ్చాయా అని ఇప్పటికీ ప్రపంచ దేశాలు చర్చించుకుంటూనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు.


తేలియాడే చెట్లు..
1939-40 సమయంలో ఫిన్లాండ్-రష్యా మధ్య వింటర్ వార్ జరిగింది. ఇందులో ఫిన్లాండ్ భూముల్ని రష్యా ఆక్రమించింది. ఆ తర్వాత 1941లో ఫిన్లాండ్ ఎదురుదాడికి సిద్ధమైంది. కానీ ఆ దేశం వద్ద సైనిక బలం పెద్దగా లేదు. పైగా రష్యా వద్ద యుద్ధ విమానాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వారి సైనికులు సుశిక్షితులు, వారి వద్ద మందుగుండు సామగ్రి కూడా భారీగా ఉంది. కానీ ఫిన్లాండ్ సైనికుల వద్ద ఉన్న ఉపాయం వారిని కాపాడింది. ఫిన్లాండ్ లో ఎక్కువ ప్రాంతం అడవులతో ఉంటుంది. రష్యా సైనికులకు అడవుల్లో గెరిల్లా తరహా యుద్ధాలు చేయడం సాధ్యం కాదు, కానీ ఫిన్లాండ్ సైనికులు ఆ తరహా యుద్ధంలో నిష్ణాతులు. కానీ రష్యా విమానాల ద్వారా ఫిన్లాండ్ సైనికులపై నిఘా పెట్టింది. అయితే ఫిన్లాండ్ సైనికులు రష్యాని పూర్తిగా బోల్తా కొట్టించారు. ఫిన్లాండ్ అడవుల్లో చెట్లను నరికి, వాటిని రహదారిపై తాళ్లతో తేలియాడేలా చేశారు. అంటే రష్యా దళాలు విమానాలనుంచి చూసినా, లేక వాచ్ టవర్ల నుంచి చూసినా అక్కడ అడవే ఉందనే భ్రమలో ఉంటారు. కానీ అలా తేలియాడే చెట్ల కింద ఫిన్లాండ్ దళాలు చురుగ్గా కదిలేవి. ఆయుధాలను రవాణా చేసేవి. ఒకచోటనుంచి ఇంకోచోటకు వెళ్లి రష్యా దళాలకు చుక్కలు చూపించాయి. ఈ తేలియాడే చెట్లు ఫిన్లాండ్ మాయోపాయానికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

రష్యాకు చుక్కలు..
రష్యా దళాలు ఎంత నిఘా పెట్టినా అంతా అడవుల్లాగే కనిపించేవి. కానీ ఫిన్లాండ్ దళాలు ఆ చెట్ల కింద చక్కగా తమ ప్లాన్ ని వర్కవుట్ చేశాయి. రష్యా దళాలను తరిమికొట్టాయి. మంచులో ఉన్న సైనికులు తెల్లటి దుస్తులు ధరించి శత్రువుల కంటికి కనపడకుండా యుద్ధం చేసేవారు. కానీ రష్యా ఈ వ్యూహాన్ని పసిగట్టలేక ఇబ్బంది పడింది. చివరకు ఈ యుద్ధంలో ఫిన్లాండ్ గెలిచింది. తమకంటే తక్కువ సైనిక బలం ఉన్న ఫిన్లాండ్ చేతుల్లో ఓడిపోవడం అప్పటి సోవియట్ రష్యా దళాలకు తీవ్ర అవమానంగా మారింది. ఫిన్లాండ్ తెలివితేటలు అలాంటివి మరి.


Also Read: సంచుల నిండా డబ్బులు.. రూ.కోటి ఉన్నా ఒక బ్రెడ్ ముక్క కూడా కొనలేని దుస్థితి

ఫిన్ ల్యాండ్‌లో చూడదగిన ప్రదేశాలు ఇవే
తెలివితేటల్లోనే కాదు పర్యాటక ప్రదేశాలకు కూడా ఫిన్లాండ్ పెట్టింది పేరు. సెప్టెంబర్ నుండి మార్చి వరకు లాప్లాండ్‌ ప్రాంతంలో నార్తర్న్ లైట్స్ ని చూడొచ్చు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం రంగులు మారడం ఇక్కడ మనం గమనిస్తాం. దీన్ని మ్యాజిక్ లైట్స్ అంటారు. ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు కనపడతాయి. ఇది ప్రకృతి అద్భుతంగా భావించవచ్చు. రోవానీమి, ఉట్స్‌జోకి ప్రాంతాల్లో ఈ నార్తర్న్ లైట్స్ ని చూసేందుకు ప్రతి ఏడాదీ పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇక ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో వారసత్వ సంపదగా యునెస్కోతో గుర్తింపు పొందిన సుయోమెన్లిన్నా సముద్ర కోట, రాతితో నిర్మించిన రాక్ చర్చి వంటివి ఉన్నాయి. పోర్వూ, రౌమా వంటి పట్టణాల్లో చెక్కతో చేసిన ఇళ్లు ఆకట్టుకుంటాయి. అక్కడి వీధులు కూడా అద్భుతంగా ఉంటాయి. ఘన చరిత్రకు అవి ఆనవాళ్లు అని చెప్పవచ్చు. తుర్కు ప్రాంతంలో మధ్యయుగానికి చెందిన ఒక భారీ కోట ఉంది. ఇక ఫిన్లాండ్ సరస్సులకు పెట్టింది పేరు. దేశం మొత్తంలో 1,88,000 సరస్సులు ఉన్నాయి. నుక్సియో, లెమ్మెన్‌జోకి వంటి 41 జాతీయ ఉద్యానవనాలు.. హైకింగ్, కయాకింగ్, స్కీయింగ్‌ కి అనుకూలంగా ఉంటాయి. క్రిస్మస్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలంటే.. ఫిన్లాండ్ లోని రోవానీమిలోని శాంతా క్లాజ్ విలేజ్‌ బెస్ట్ ప్లేస్.

Related News

Trains Cancelled: రైల్వే షాకింగ్ డెసిషన్, ఏకంగా 100 రైళ్లు రద్దు!

Railway Robberies: ఫస్ట్ ఏసీ కోచ్‌లోకి దూరి మరీ.. రెచ్చిపోయిన దొంగలు!

Train Cancelled: వైజాగ్ వెళ్లే ప్రయాణీకులకు అలర్ట్, ఆ రూట్ లో రైలు సర్వీసులు బంద్!

Indian Railways: అరే బాబూ.. అది రైల్వే టాయిలెట్.. ఓయో రూమ్ కాదు రా!

Magnetic Hill: ఇక్కడ వాహనాలు వాటికవే కదులుతాయి.. ఈ వింత ప్రదేశంపై పరిశోధకులు ఏం చెప్పారంటే?

Indian Railways: ప్రయాణికులపై రైల్వే బాదుడు.. విమానాల తరహాలో కొత్త రూల్స్, ఎందుకు?

Big Stories

×