E-Paper
Advertisement

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!
Advertisement

Bandla Ganesh speech :కమెడియన్ గా మొదలై స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్ మైక్ పట్టుకున్నాడంటే అభిమానులకి పూనకాలు రావాల్సిందే! ఇక ఎప్పుడు పవన్ కళ్యాణ్ పై తన్నభక్తిని చాటుకునే బండ్ల గణేష్, ఈసారి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో తనదైన మాస్ స్పీచ్‌తో రాంపేజ్ ఆడేశాడు.ముఖ్యంగా సోషల్ మీడియాలో అనవసరంగా విమర్శలు చేసే నెగెటివ్ బ్యాచ్‌కు, ట్రోలర్స్‌కు ఆయన ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అయ్యప్ప స్వామి సాక్షిగా చెబుతున్నా

ఈ ఈవెంట్‌లో బండ్ల గణేష్ మాట్లాడేందుకు వేదికపైకి రాగానే ఫ్యాన్స్ కేరింతలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. స్పీచ్ ప్రారంభంలోనే ఆయన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతుల కడుపున జన్మించిన ఆ పరమశివుడి స్వరూపమే చిరంజీవి అంటూ ఆకాశానికెత్తేశాడు బండ్ల.ఇక తాను ఎక్కువగా నమ్మే శబరిమల అయ్యప్ప స్వామి సాక్షిగా చెబుతున్నా అంటూ అత్యంత నిజాయితీగా మాట్లాడిన గణేష్, చిరు క్యారెక్టర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడేవారిపై తీవ్రంగా మండిపడ్డారు. మన భారతదేశానికి రామాయణం, మహాభారతం, భగవద్గీత ఎంత పవిత్రమైనవో, తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి గారి చరిత్ర కూడా అంతే పవిత్రమైనదని స్పష్టం చేశారు. అలాంటి మహానుభావుడిని ఒక లెజెండ్‌లా గౌరవించాలి గానీ అడ్డమైన మాటలు మాట్లాడకూడదని కడిగిపారేశారు.

తండ్రిని మించిన కొడుకుగా రామ్ చరణ్

Advertisement

ఇక మెగాస్టార్ వారసత్వం గురించి మాట్లాడే సమయంలో బండ్ల గణేష్ మరింత ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి గారి రక్తానికి సరైన ప్రతిరూపంగా, తండ్రిని మించిన కొడుకుగా రామ్ చరణ్ నిలిచాడని గర్వంగా చెప్పుకొచ్చారు. కొండంత ఆస్తి,పేరు ప్రఖ్యాతులు ఉంటే ఇంట్లోనే కూర్చొని హాయిగా అనుభవించవచ్చు, కానీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగి, ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్లతో తండ్రి పేరును ప్రపంచస్థాయిలో నిలబెట్టాడని ఆకాశానికి ఎత్తేశాడు.

విమర్శలు చేయడం అజ్ఞానమే

ఇక ఇంట్లో పిల్లలకి చిన్న జ్వరం వస్తేనే జండుబామ్ రాస్తారు, అలాంటిది శారీరకంగా, మానసికంగా ఎన్నో ఎముకలు విరిగినా, రక్తం చిందించినా నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఒంటిచేత్తో ఏలిన ఏకైక నాయకుడు చిరంజీవి అని నిప్పులు చెరిగాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక నటుడిగా, ఒక శిఖరంగా చిరు ఎదిగిన తీరు అద్భుతమైనదని చెప్పుకొచ్చాడు. తన వెంట ఉన్న ప్రతి అభిమాని, ప్రతి సినీ కార్మికుడు బాగుండాలని కోరుకునే మహానుభావుడు మన మెగాస్టార్ అని, ఆయన క్యాలిబర్, స్టామినా  ముందు అడ్డగోలుగా  విమర్శలు చేయడం అజ్ఞానమే అవుతుందని ఇచ్చిపడేశాడు.

సోషల్ మీడియాలో వైరల్ 

Advertisement

‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, ఇప్పుడు ‘విశ్వంభర’ (Viswambhara) వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంతో రాబోతున్న చిరంజీవి గారి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మెగాస్టార్ రేంజ్, బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించడానికి ఈ కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయని బండ్ల ఇచ్చిన  స్పీచ్‌ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపిదనే చెప్పాలి.

also read :తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇక చివరలో “చిరంజీవి గారు మాకు కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయన మా దేవుడు” అని బండ్ల గణేష్ అని అనడం అభిమానులకు పూనకాలు తెప్పించింది.ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×