E-Paper
Advertisement

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం “మెగా 158” అఫీషియల్ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. KVN ప్రొడక్షన్స్ పై వెంకట్ K నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, ఈ చిత్రం కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా సాలిడ్ ఎమోషన్స్ తో సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.

‘I లవ్ DAD”

పోస్టర్‌ను పరిశీలిస్తే గోడకు ఉన్న ఓ మేకుకి “I లవ్ DAD” అని రాసి ఉన్న కీచైన్ వేలాడుతూ కనిపించడం విశేషం. దానికి వెనుక ఓ నీడలో చిరు  కనిపించడం ప్రేక్షకుల్లో, అభిమానుల్లో రకరకాల అంచనాలను పెంచుతోంది. తండ్రీ-కూతుళ్ల మధ్య ఉండే అనుబంధం కీలకమైన అంశంగా ఉండబోతోందని ఈ పోస్టర్ హింట్ ఇస్తుంది. రేపు ఉదయం 9:09 గంటలకు ఈ సినిమా నుండి
టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రిపీట్

Advertisement

ఇక వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్ వర్గాల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి మాస్ ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో వాడుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్లని కొల్లగొట్టిన బాబీ, ఈసారి కూడా అంతకుమించిన కంటెంట్‌తో రాబోతున్నారని టాక్ నడుస్తోంది.

ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం, మాస్ పాటలు ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ అని చెప్పక తప్పదు. అలాగే ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.

Advertisement

also read :ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

ఏ మేరకి అంచనాలు అందుకోబోతుందో

చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ నుండి గ్లిమ్ప్స్ వస్తుందన్న వార్త నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా టైటిల్ పోస్టర్ డిజైన్, కీచైన్‌పై ఉన్న “I లవ్ DAD” చూసి రేపొచ్చే గ్లిమ్ప్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ ఇప్పటి నుండే సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారుమెగా అభిమానులు,మరి వైరల్ అవుతున్నట్టుగా కాకా లేదా కదిరి అనే పేర్లతో సినిమా టైటిల్ ఉండబోతుందా లేక మరేదైనా సరికొత్త టైటిల్ పెట్టి అభిమానులకి షాక్ ఇస్తారో. చూడాలి మరి మొత్తంగా  రేపు రానున్న ఈ గ్లిమ్ప్స్ ఏ మేరకి అంచనాలు అందుకోబోతుందో !

Tags

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×