E-Paper
Advertisement

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!

నటికి భారీ షాక్.. రూ. 89 కోట్లు పెనాల్టీ!
Advertisement

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్న కన్నడ నటి రన్యారావుకు కస్టమ్స్ శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. అక్రమంగా రూ. కోట్ల విలువైన బంగారాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చినందుకు గాను ఆమెకు ఏకంగా రూ. 89 కోట్ల భారీ జరిమానా విధిస్తూ కస్టమ్స్ శాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చిన ఈ భామకు, ఈ పెనాల్టీ రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు వివరాలు ఇప్పుడు చూద్దాం..

బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ రన్యారావు:

ఈ కేటాయింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది 2025 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన నటి రన్యారావును డీఆర్‌ఐ (DRI) అధికారులు తనిఖీ చేయగా, ఆమె వద్ద ఏకంగా 14 కిలోల అక్రమ బంగారం లభ్యమైంది. ఇక వెంటనే ఆమెను అధికారులు అరెస్ట్ చేసి సీఓఎఫ్‌ఈపీఓఎస్‌ఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఏడాదిలోనే 113 కిలోల బంగారం స్మగ్లింగ్:

Advertisement

కస్టమ్స్ అధికారులు జరిపిన సమగ్ర దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2024 మార్చి 7 నుండి 2025 ఫిబ్రవరి 18 మధ్య కాలంలో ఆమె సహచరుడు రన్యారావుకు మరో ముగ్గురితో కలిసి విదేశాల నుంచి ఏకంగా 113 కిలోల బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు కస్టమ్స్ జాయింట్ కమిషనర్ సందీప్ విడుదల చేసిన 399 పేజీల దర్యాప్తు నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

also read:ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

రూ. 89 కోట్ల మైండ్ బ్లాకింగ్ పెనాల్టీ:

Advertisement

ఈ కేసులో రన్యారావు దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ప్రత్యేక న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా కస్టమ్స్ శాఖ కేసు విచారణను పూర్తి చేసి, రన్యారావుకు రూ. 89 కోట్ల జరిమానా విధించగా, ఆమెతో ఉన్న మిగతా ముగ్గురు నిందితులకు కలిపి రూ. 155 కోట్ల పెనాల్టీ విధించింది.

సినిమాల్లో మెరవాల్సిన కన్నడ నటి రన్యారావు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌లో భాగమై చివరికి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇక కోట్లాది రూపాయల పెనాల్టీలతో పాటు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్న ఈ నటి వ్యవహారం ప్రస్తుతం సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Related News

బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !

జైలర్ 2 విడుదల పై బిగ్ అప్డేట్.. మరింత గ్రాండ్ గా రిలీజ్!

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×