Mohanbabu:దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల, నాని కాంబో మళ్లీ తెరపైకి వచ్చిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ప్యారడైజ్. దసరా సినిమా ఊహించని కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమా అంతకుమించి ఉంటుందనే హైప్ తో ది ప్యారడైజ్ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేశారు. అయితే మొదటి టాక్ నెగిటివ్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం ఈ సినిమా బాగానే రాబడుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో పాల్గొన్న మోహన్ బాబు చేసిన సరదా కామెంట్స్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. “డైరెక్టర్ శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెబుతున్నప్పుడే.. మీకు ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంది అని, కొన్ని సీన్లు కూడా చెప్పాడు. అయితే నేను పాత హీరోయిన్స్ వద్దు.. కొత్త వాళ్ళని పెడదామని అడిగాను. అలా కొత్త వాళ్లను పిలిపించి టెస్ట్ కూడా చేశాము. ఎక్కడయ్యా నా వైఫ్ క్యారెక్టర్ అని ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత అడిగితే.. చావు కబురు చల్లగా చెప్పినట్టు.. వైఫ్ క్యారెక్టర్ లేదు సార్. తీసేసాం.. కొన్ని కారణాలవల్ల తీసేయడం జరిగింది అంటూ చెప్పారు” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు మోహన్ బాబు.
మొత్తానికైతే ఈ సినిమాలో మొదట తనకు వైఫ్ క్యారెక్టర్ పెడతామని చెప్పి , మళ్ళీ తీసేయడంతో తనను శ్రీకాంత్ చీట్ చేశాడు అంటూ మోహన్ బాబు చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ మోహన్ బాబు సరసన వైఫ్ క్యారెక్టర్ చేసి ఉండుంటే ఆ ఛాన్స్ ఎవరికీ వచ్చిండేదో మరి.
also read:అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!
ది ప్యారడైజ్ సినిమా విషయానికి వస్తే.. తెలుగు యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ప్యారడైజ్ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా నటించగా.. మోహన్ బాబు విలన్ పాత్ర పోషించారు. రాఘవ్ జుయల్ కీలకపాత్ర పోషించారు.. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, స్పానిష్, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సుమారుగా 150 నుండీ 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే మొదటి వారం ఈ సినిమా 123.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 100 కోట్లు నెట్ కలెక్షన్లు ఇండియా వైడ్ రాబట్టినట్లు సమాచారం.