KTR: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు హోటల్లు ఉన్నాయని కేటీఆర్ ఓప్పుకున్నారు. కాలేశ్వరంలో లక్ష కోట్లు అవినీతి అన్నారు. కమిషన్ వేశారు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలోపై కమిషన్ వేసారు ఏం చేశారు. ఫార్ములా ఈ పై కేసు పెట్టారు ఏం తేల్చారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లలో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారికి లక్ష రూపాయలు పరిహారం ఇస్తారని భావించామని కేటీఆర్ అన్నారు. నల్లమల పులి 4000 మంది పోలీసులు పెట్టుకొని పోతాడా? నల్లమల పులి కాదు చంద్రబాబు వద్ద పిల్లి అంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిలా వచ్చావా సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకోవడానికి వచ్చావా అంటూ సెటేర్లు వేసారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నీ ఫ్రస్టేషన్ ఏంటి? 9వ తరగతి చదివిన కొండల్ రెడ్డి ఏరోస్పేస్ ఓనర్ అయ్యాడని అన్నారు.
Also read: అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!
అమెరికాలో ఉన్నాడో ఎవడైనా మనం పని చేసుకోవాల్సిందేనని, మనం తిన్న చిప్పలు మనంచేసుకోవాల్సిందేనని అన్నారు. ఊరు పేరు లేని రేవంత్ అన్నదమ్ములకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు. ఎన్టీఆర్ మంచివాడు గొప్పవాడు 83లో మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని గుర్తు చేశారు. 43 ఏళ్లుగా కెసిఆర్ చట్టసభల్లో ఉన్నారు. చింతమడకలో మా తాతకు వందల ఎకరాల భూమి ఉందని కేటీఆర్ అన్నారు. అమెరికాలో ఉద్యోగం చేసుకొని సంపాదించుకున్నానని అన్నారు. CM రేవంత్ రెడ్డి నీ లెక్క ప్రజల సొమ్ము దోచుకోలేదని అన్నారు. నా పెళ్ళాం పిల్లల్ని సాదుకోవాలి కాబట్టి వ్యాపారం చేసుకున్నా.. వ్యాపారం తప్పవుతుందా అని ప్రశ్నించారు.
2006లో అప్పటి ప్రభుత్వం లోనే నేను హోటల్ పెట్టుకున్నాని అన్నారు. 2009లో ఎన్నికల అఫ్డవిట్‌లో నా ఆస్తులు పేర్కొన్నాని చెప్పారు. నా హోటల్కు పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి థాంక్స్ అని కేటీఆర్ అన్నారు. మా ఆస్తులపై రేవంత్ రెడ్డి నీ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. మా తాతల ఆస్తుల నుంచి మీ తాతల ఆస్తుల వరకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం అని, మాది తప్పని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం అని అన్నారు. నువ్వు ఒక భాషలో పెడితే మేము నాలుగు భాషల్లో తిట్టగలం రేవంత్ రెడ్డి గోకిన గోకకున్న మేము గోకుతనే ఉంటాంమని కేటీఆర్ అన్నారు.
Also read: వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!