Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్య ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు వరుసగా ఏదో ఒక కారణం వల్ల మరణిస్తున్నారు. నిన్నగాక మొన్న ఉన్నటుడు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూశారు. బాలీవుడ్ నటి రిమా లగూ మాజీ భర్త వివేక్ లగూ మరణించారు. వయో భారం, అనేక అనారోగ్య సమస్యల కారణంగా ఆయన స్వగృహంలోనే మరణించినట్లు తెలుస్తుంది. ఇవాళ ముంబైలోని ఓషివారా స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం. ఇప్పటికే ఆయన మృతి వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియల్లో చాలామంది సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..
వివేక్ లగు కన్నుమూత..
బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా మరణ వార్తలు వింటునే ఉన్నాం.. కేవలం రోజుల వ్యవధిలోనే ఇలా వరుసగా మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే నటీనటులతో పాటు దర్శక దిగ్గజాలు, నిర్మాతలు పలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు.. మొన్న ఓ నటుడు మరణించిన విషయాన్ని పూర్తిగా మరవకముందే మరో నటుడు కన్నుమూశారు. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి తీవ్రని లోటనే చెప్పాలి. తాజాగా నటి రీమా లగు మాజీ భర్త అయినటువంటి వివేక్ లగు కన్నుమూశారు. వయసు పై పడటంతో గత కొద్ది రోజులుగా అయ్యేనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.. ఆ మధ్య కొద్ది రోజులు చికిత్స తీసుకున్నట్లు సమాచారం. మరాఠీ, హిందీ నాటకాలు సీరియల్స్ సినిమాలలో ఈయన నటించారు. ఈయన నటించిన కొన్ని అవార్డులను కూడా అందుకున్నాయి.. ఈయన మరణ వార్తను కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేడు ముంబైలో అంత్యక్రియలు గ్రాండ్గా జరగనున్నన్నాయి. ఈ అంత్యక్రియల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తుంది..
Also Read :హిట్ 3 కాపీనా..? హైకోర్టులో నాని ఫ్యాన్ కేసు..
వివేక్ లగూ సినీ ప్రస్థానం..
పూణే విశ్వవిద్యాలయంలో ఈయన పూర్వ విద్యార్థి. నటనపై ఆసక్తి ఉండడంతో ఆయన నాటకీయ రంగ ప్రవేశం చేశారు.. మరాఠీలో నాటకాలు, సీరియల్స్ సినిమా రంగానికి ఈయన చేసిన సేవలు వర్ణనాతీతం. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన నటించిన సినిమాల్లో ఆయన పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో ఎక్కువ మంది ఆయనకు అభిమానులుగా మారారు. నటి రీమాను పెళ్లి చేసుకున్నారు. అయితే మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు.. నేడు అంత్యక్రియలకు రీమా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..