E-Paper
Advertisement

తండ్రయిన స్టార్ హీరో.. ఏం పేరు పెట్టారో తెలుసా?

తండ్రయిన స్టార్ హీరో.. ఏం పేరు పెట్టారో తెలుసా?
Advertisement

Bollywood:ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ దీప్ హుడా(Randeep Hooda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. విలక్షణమైన నటుడిగా, అశ్వ శిక్షకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన తాజాగా తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన భార్య లిన్ లైస్రామ్, చంటి పాపాయిని ఒడిలో పెట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. నా భార్య లిన్ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈనెల ఏడవ తేదీన నేను తండ్రిని అయ్యాను. ఆమె మా ఇంట్లోకి రావడం ఆ దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. నా కూతురికి “న్యోమికా హుడా” అని నామకరణం చేసాము. ఈ చిన్నారి రాకతో మేము మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాము అంటూ రణ్ దీప్ హుడా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ పాపాయి ఫోటోని చూపించండి అంటూ అభిమానులు కోరుతున్నారు.

తండ్రి అయిన రణ్ దీప్.. పెళ్లిపై ఊహించని కామెంట్..

ఇకపోతే తాజాగా ఈయన తండ్రి కావడంతో గతంలో పెళ్లి పై ఈయన చేసిన కామెంట్లకు సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్ దీప్ మాట్లాడుతూ.. నేను ఏ విధంగా అయితే చదువుకున్నానో ఆ విధంగా మరెవరు ఇబ్బంది పడకూడదు అని నేను అనుకునేవాడిని. నా స్కూల్ విద్యాభ్యాసం మొత్తం ఇబ్బందికర పరిస్థితుల్లోనే సాగింది. నేను చదివే రోజుల్లో ఎంతో నిరాశతో ఉండేవాడిని. అందుకే నా సమస్యలు మరొకరికి రాకూడదని కోరుకున్నాను. ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేని సమయంలో లిన్ నా జీవితంలోకి వచ్చింది. మా జీవితాలు మారిపోయాయి. అభిప్రాయాలు కలిశాయి. వయసు రీత్యా నేను ఆలస్యంగా వివాహం చేసుకున్నాను. అయితే ఈ విషయంపై నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నాకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేదు అందుకే పెళ్లి ఆలస్యమైంది” అని సరదాగా చెబుతూ ఉంటాను అంటూ రణ్ దీప్ తెలిపారు.

పెళ్లికి ఒప్పుకోని పెద్దలు..

Advertisement

ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు రణ్ దీప్ హుడా తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఒకింత అసహనం వ్యక్తం చేశారట . ముఖ్యంగా తమ ఆచారాలు తెలిసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారట . దానివల్ల కొంత ఇబ్బంది పడినా.. కొంతకాలానికి ఆ సమస్య సమిసిపోయిందని , లిన్ లైస్రామ్ కుటుంబానికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమె పుట్టి పెరిగిన మణిపూర్ లోనే పెళ్లి చేసుకున్నామని ఆయన తెలిపారు. చాలా తక్కువ మంది బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని మణిపూర్ లో నాటి పరిస్థితుల రీత్యా బంధువుల కంటే సెక్యూరిటీనే ఎక్కువ సంఖ్యలో తమ పెళ్ళిలో పాల్గొన్నారు.. అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇకపోతే ఈయన ప్రముఖ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన జాట్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు.

also read:మెగాస్టార్ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న సిల్క్ స్మిత.. చిరు ఏం చేశారంటే?

నటుడు మాత్రమే కాదు అశ్వ శిక్షకుడు కూడా..

Advertisement

నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. నేషనల్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్ లో పలు పథకాలు సాధించారు. అలాగే ఈయన దగ్గర కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రపు స్వారీలో శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు.

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×