Bollywood Actor: సాధారణంగా ఎవరైనా 59 ఏళ్ల వయసులో ఏం చేస్తారు? మహా అయితే కృష్ణా రామా అంటూ ఇంట్లో ఓ మూలనపడి కూర్చుంటారు. ఇంకొంతమందేమో కాశి లాంటి ప్రదేశాలకు తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ ఈ బాలీవుడ్ హీరో (Bollywood Hero) మాత్రం 60 ఏళ్లకు వయసుకు చేరువలో ఉన్నా కూడా దాదాపు 600 కిలోమీటర్ల పరుగులు పెట్టి అందరితో ఆహా అనిపించారు. మరి ఇంతకీ 60 ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నా.. ఏజ్ ని పక్కన పెట్టి 600 కిలోమీటర్లు పరుగులు పెట్టిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..
సినిమా ఇండస్ట్రీలో ఏజ్ తో పనిలేదు. 80 ఏళ్లు ఉన్నా కూడా హీరోగా రాణిస్తూనే ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోల ఏజ్ 60 ఏళ్లకు పైమాటే.. కానీ ఇంకా వాళ్ళు సినిమాల్లో హీరోగానే రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఏజ్ ఎక్కువైనా యంగ్ గానే కనిపిస్తారు. దానికి కారణం వాళ్ళు మెయింటైన్ చేసే ఫిట్నెస్ డైట్లు.. అయితే అలాంటి ఒక హీరో గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
59 ఏళ్ల వయసులో 600 కిలోమీటర్లు పరుగు తీసిన నటుడు..
ఆ హీరో ఏజ్ 59 ఏళ్లు.. కానీ ముంబై నుండి గోవా వరకు పరిగెత్తుకుంటూ, సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మిలింద్ సోమన్(Miland Soman).. ఈయన ప్రతి సంవత్సరం ‘ది ఫిట్ ఇండియన్ రన్’ అనే పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారట. అలా ఈ ఏడాది నిర్వహించిన ఈ రన్నింగ్ ఈవెంట్ లో కూడా పాల్గొని దాదాపు 600 కిలోమీటర్లు కేవలం 5 రోజుల్లోనే ప్రయాణం చేశారు.. జూన్ 26 ముంబై(Mumbai)లోని శివాజీ పార్క్(Sivaji Park) నుండి మిలింద్ సోమన్ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి.. జూలై 3వ తేదీన గోవా(Goa)కి చేరుకున్నాడు..
ఐదు రోజుల్లోనే లక్ష్యాన్ని చేదించిన నటుడు..
అలా మిలింద్ సోమన్ ప్రతిరోజు 21 కిలోమీటర్లు పరుగు చేసి,90 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి దాదాపు 5 రోజుల్లో తన లక్ష్యాన్ని ఛేదించాడు. అలా ముంబై నుండి గోవా కి దాదాపు 600 కిలోమీటర్లు సైక్లింగ్ అలాగే పరుగుతో లక్ష్యాన్ని పూర్తి చేశాడు.. అయితే 59 ఏళ్ల వయసులో ఉన్న మిలింద్ సోమన్ ఇలాంటి ఒక సాహసం చేయడం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
వారి ప్రోత్సాహం వల్లే ఇదంతా – మిలింద్
“నేను ది ఫిట్ ఇండియన్ రన్(The Fit Indian Run) లో భాగంగా 600 కిలోమీటర్లు దాదాపు 5 రోజుల్లో ప్రయాణం చేశాను. నేను ప్రతి సంవత్సరం ఈ ఛాలెంజ్ ని ఎదుర్కొంటాను. ఈ ఫిట్ ఇండియన్ రన్ లో పాల్గొన్నప్పుడు చాలామంది నాకు విష్ చేసి నన్ను మరింత ప్రోత్సహించారు.వాళ్ళు నన్ను ప్రోత్సహించడమే కాకుండా ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్స్ లో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది” అంటూ మిలింద్ సోమన్ చెప్పుకొచ్చారు.
మిలింద్ సోమన్ సినిమాలు..
ప్రస్తుతం 59 ఏళ్ల వయసులో ఈ హీరో చేసిన అద్భుతమైన సాహసం గురించి తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇక మిలింద్ సోమన్ సినిమాల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా బాలీవుడ్ లోనే చేశారు. కానీ తెలుగులో రాజశేఖర్ (Raja Sekhar) నటించిన సత్యమేవ జయతే సినిమా (Sathyameva Jayathe Movie)లో ఒక కీ రోల్ పోషించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.
ALSO READ:Nayanthara: విఘ్నేష్‌తో విడాకులు? పెళ్లిపై నయన్ షాకింగ్ పోస్ట్!
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==