Balakrishna vs Jr NTR:నందమూరి బాలకృష్ణ , ఎన్టీఆర్ మధ్య గొడవలు ఉన్నాయని,అందుకే వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదని ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాలకృష్ణ(Balakrishna) హోస్టుగా చేసే ప్రముఖ టాక్ షో అయినటువంటి అన్ స్టాపబుల్ షో (Un stoppable with NBK)కి ఎంతో మంది హీరోలు వెళ్లారు. కానీ ఒక్క ఎన్టీఆర్ ని మాత్రమే పిలవలేదు. అది కూడా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలే కారణం అంటూ ఉంటారు. మరి నిజంగానే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయా అంటే చాలామంది అవుననే సమాధానం చెబుతారు.
అన్ స్టాపబుల్ షోకి బాలయ్యను సూచించింది నేనే – బీవీఎస్ రవి
కానీ తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక రచయిత వీరి మధ్య ఉన్న గొడవల గురించి అసలు నిజం బయటపెట్టారు.. బీవీఎస్ రవి(BVS Ravi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అన్ స్టాపబుల్ షో(Un Stoppable Show) ముందు అనుకున్నప్పుడు ఓ ఐదుగురు పెద్ద హీరోల పేర్లు చెప్పి అందులో ఎవరైతే బాగుంటారని అల్లు అరవింద్(Allu Aravind) నన్ను అడిగారు. దానికి బాలకృష్ణ అయితే సెట్ అవుతారు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ బాలయ్య బాబు సుపరిచితులు. అందుకే ఆయన్ని పెట్టండని చెప్పాను. ఇక ఎన్టీఆర్ (NTR)కి బాలకృష్ణకి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు పూర్తిగా అవాస్తవమే. అది కేవలం సోషల్ మీడియా నెటిజన్లు సృష్టించిన ఫేక్ వార్తలు మాత్రమే.వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.బాబాయ్ – అబ్బాయ్ మధ్య ఏం విభేదాలు ఉంటాయ్. వారి మధ్య ఫ్యామిలీ గొడవలు కూడా లేవు.
బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య విభేదాలపై బీవీఎస్ రవి క్లారిటీ..
అయితే వీరిద్దరూ కలసి కనిపించడం లేదు కదా.. పైగా అన్ స్టాపబుల్ కి పిలవడం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ వీరిద్దరూ ఎక్కువగా కలిస్తే వీరిని ఎవరు పట్టించుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి రేర్ గా కలిస్తే మాత్రమే వీరి జోడికి హైప్ ఉంటుంది. అందుకే వీళ్ళు తరచుగా కనిపించరు. ఇక అన్ స్టాపబుల్ షో కి అంటారా.. ఆ షోకి ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా వస్తారు. అయితే ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్స్, ట్రావెలింగ్ లో ఉండడం వల్ల, నెక్స్ట్ సినిమాలకు సంబంధించి లుక్ రివీల్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ షోకి రావడం లేదు. కానీ కచ్చితంగా ఎన్టీఆర్ ఈ షోకి త్వరలోనే వస్తారు అంటూ బీవీఎస్ రవి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు.
బీవీఎస్ రవి మాటలపై నమ్మకం లేదంటున్న సినీ లవర్స్..
అయితే ఈ వార్తలు కాస్త వైరల్ అవ్వడంతో.. బీవీఎస్ రవి మాట్లాడిన మాటల్ని ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే బాలకృష్ణ- ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నది నిజమేనని, అందుకే ఎన్టీఆర్ ని ఆ షోకి పిలవలేదని అంటున్నారు. అంతేకాదు వారి మధ్య గొడవలు లేకపోతే ఇంతమంది హీరోలు వచ్చారు కానీ ఆ హీరోలని ఎన్టీఆర్ గురించి ఎందుకు అడగలేదు. అలాగే తారకరత్న (Taraka Ratna) చనిపోయిన సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్(Kalyan Ram) ను దూరం పెట్టిన విజువల్స్ అందరికీ క్లారిటీగా కనిపించాయి. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా బాలకృష్ణతో ఉన్న విభేదాల వల్లే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు రాలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వార్తలకు ఎప్పుడు చెకక్ పడుతుందో చూడాలి.
ALSO READ:Daggubati Family: కోర్ట్ మెట్లెక్కనున్న వెంకటేష్, రానా, సురేష్ బాబు.. అసలేం జరిగిందంటే?